KCR NEW PARTY:   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పార్టీకి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. దసరా రోజున తెలంగాణ భవన్ లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేసిన కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. జాతీయ పార్టీకి సంబంధించి కసరత్తు కూడా పూర్తైందని.. జెండా, అజెండా ఖరారు చేశారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో పెట్టబోయే పార్టీకి సంబంధించి నాలుగైదు పేర్లు తెరపైకి వచ్చాయి. భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), నవ భారత్ వంటి పేర్లను పరిశీలించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ను పోలినట్లుగా ఉన్న బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాలనే వార్తలు వచ్చాయి. దసరా రోజున కొత్త పార్టీ పేరును గులాబీ బాస్ ప్రకటిస్తారని  వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కేసీఆర్ కొత్త పార్టీ పేరు విషయంలో నిర్ణయం మారిపోయిందని తాజా సమాచారం. ఇప్పటి వరకుపెద్ద ఎత్తున వినిపించిన భారత రాష్ట్ర సమితికి బదులుగా మరో పేరును కేసీఆర్ సీరియస్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.భారత రాష్ట్ర సమితి పేరు ఆసక్తికరంగా లేదన్న వాదనల నేపథ్యంలో దానికి బదులుగా 'భారత వికాస సమితి' పేరును కేసీఆర్ ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినా...  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ పేరునే ఫైనల్ చేసే అవకాశం ఉందంటున్నారు.  దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయాలని కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్... అందుకు తగ్గట్లుగానే కొత్త పార్టీ పేరు ఉండాలని భావిస్తున్నారని చెబుతున్నారు.


ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పేరులో ప్రాంతీయ పార్టీ ముద్ర ఉందని కొందరు చెప్పారట. యావత్ దేశాన్ని రిప్రజెంట్ చేసేలా పేరు ఉండాలన్న కేసీఆర్ సూచనతో కొత్త పేరును నిపుణులు సూచించారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూడా ఇటీవల ఎక్కడ మాట్లాడినా దేశ అభివృద్ధిపైనే మాట్లాడుతున్నారు. చైనా, అమెరికాతో పోలుస్తూ దేశ పరిస్థితులను వివరిస్తున్నారు. కేసీఆర్ ఆలోచనకు తగ్గట్లుగానే కొత్త పేరును సూచించారని తెలుస్తోంది.కొత్త పేరుపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఫైనల్ చేశారని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజం ఎంతన్నది తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే...


Read also : KCR MEETING : జాతీయ పార్టీనా.. అసెంబ్లీ రద్దా?  ప్రగతిభవన్‌లో  కేసీఆర్ కీలక భేటీ.. దసరాకు ఏం జరగనుంది?


Read also : FOOTBALL FANS FIGHT: రక్తపాతంగా మారిన ఫ్యాన్స్ ఫైట్.. 129 మందిని బలి తీసుకున్న ఫుట్ బాల్ మ్యాచ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి