FOOTBALL FANS FIGHT: ఇండోనేషియాలో పెను విషాదం జరిగింది. ఫుట్ బాల్ మ్యాచ్ వందలాది మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఈస్ట్ జావా కంజురుహన్ స్టేడియంలో జరిగిన ఇండోనేషయన్ లీగ్ ఫుట్ బాల్ మ్యాచ్ లో అరెమా జట్టు పెర్సెబయ సురబయ జట్టు చేతిలో ఓడిపోయింది. దీంతో ఆ దేశ ఫ్యాన్స్ తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రత్యర్థి జట్టు అభిమానులతో గొడవకు దిగారు. ఇరు జట్ల అభిమానులు స్టేడియంలో తీవ్రంగా కొట్టుకున్నారు. ఫ్యాన్స్ మధ్య ఫైటింగ్ ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో స్టేడియంలో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో మొత్తం 129 మంది చనిపోయారు. మరికొందరు తీవ్ర గాయాలై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు చెప్పారు. ఈ ఘటన ఇండోనేషియాలో తీవ్ర విషాదంగా మారింది.
127 people died in an Indonesian football match on Oct. 1, 2022. The police used tear gas to disperse conflicting supporters which allegedly led to a crowd stampede.
A video shows the situation in the stadium: pic.twitter.com/dciBpTVwzN
— kevin ng 黄協龍 (@sandhatu) October 2, 2022
తూర్పు జావా ప్రాంతంలోని మలాంగ్‌లోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా ప్రీమియర్ లీగ్ గేమ్ జరిగింది. అరెమా జట్టు పెర్సెబయ సురబయ జట్టు చేతిలో 3-2 ఓడిపోయింది. మ్యాచ్ ముగియగానే స్టేడియం లోపల రెండు ప్రత్యర్థి జట్ల మద్దతుదారుల మధ్య గొడవలు జరిగాయి.అల్లర్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఫ్యాన్స్ భయంతో పరుగులు తీశారని తూర్పు జావా పోలీసు చీఫ్ నికో అఫింటా తెలిపారు. వందలాది మంది ఒక్కసారిగా ఎగ్జిట్ గేట్ వద్దకు పరుగులు తీశారు. ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగింది.కిందపడిపోయిన కొందరు అభిమానులు ఊపిరి అందక చనిపోయారు. స్పాట్ లోనే 34 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్గ గాయాలైన 300 మందిని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ వాళ్లలో కొందరు చనిపోయారు.
క్షతగాత్రుల్లో 180 మందికి సీరియస్ గా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని చెబుతున్నారు. స్టేడియంలో అల్లర్లు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోతో పోలీసులు రంగంలోకి దిగారని తెలుస్తోంది. అభిమానులకు అదుపు చేసేందుకు మొదట లాఠీచార్జ్ చేశారు. అయినా కంట్రోల్ కాకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ యూనస్ నుసి అల్లర్లను ఖండించారు.లీగ్‌ను ఒక వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్లు PSSI ప్రకటించింది. మిగిలిన సీజన్ లో ఆడకుండా అరేమా జట్టుపై నిషేదం విధించింది.
Read also: Uttar Pradesh Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ కుంటలో పడి 22 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి