KCR Press meet: మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ ప్రెస్ మీట్.. గెలుపు ఓటములపై ఆసక్తికర వ్యాఖ్యలు
KCR Press meet: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తాజాగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో గెలుపు, ఓటములపై సీఎం కేసీఆర్ వేదాంత ధోరణిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
KCR Press meet on Munugode Bypolls: భారమైన హృదయంతో తాను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నానని అన్నారు. 45 ఏళ్ల నుండి ప్రజా జీవితంలో ఉన్నాం. కానీ ఈ రోజు దేశంలో జరుగుతున్న ఈ దుర్మార్గం ఏదైతే ఉందో.. అది ప్రజాస్వామ్య హంతకుల స్వైర విహారం అని సీఎం కేసీఆర్ అన్నారు. మన ఊహకు కూడా అందనంత దుర్మార్గం దేశంలో ఉందన్నారు. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి బీజేపి దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసింది. రూపాయి విలువ అట్టుడుగుకు పడిపోయింది. భారత దేశం ఆకలి రాజ్యంగా మారుతోంది. ఇది సరిపోదన్నట్టు ప్రజలను విభజించి పాలించడం అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. రెండు, మూడు రోజుల ముందే ఈ విషయాలను చెప్పాలనుకున్నప్పటికీ.. మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే తాను ప్రెస్ మీట్ పెట్టానని సంకుచిత స్వభావం ఉన్న వ్యక్తులు నీచమైన వ్యాఖ్యలు చేస్తారనే ఉద్దేశంతోనే మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసేవరకు వేచిచూసినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మునుగోడులో జరిగిన ఎన్నిక కూడా మీరు చూశారు. చేతుల్లో పూవ్వు గుర్తులు దించడం, కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి వచ్చి తనను కలిసినట్టు దుష్ప్రచారం చేయడం లాంటివి తనను బాధించాయని అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. చాలా గెలుస్తాం.. చాలా ఓడుతాం. ఇప్పటివరకు జరిగిన నాలుగు ఉప ఎన్నికలలో హుజూరాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కాగా.. నాగార్జునసాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. ఒకచోట గెలిచి, ఒకచోట ఓడిపోతుంటాం. ప్రజాతీర్పును గౌరవించాలి కానీ మరోలా భావించరాదని గుర్తుచేశారు.
రాజకీయాల్లో ఉన్న వారు సహనం పాటిస్తూ తమ స్థాయి, హోదాను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయకపోగా చివరకు ఎన్నికల సంఘం విఫలమైందని, ఇక్కడి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఫెయిలయ్యారని ఆరోపించడం ఎంతవరకు సబబు అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఆమాటకొస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ల పార్టీనే కదా ఎన్నికల సంఘాన్ని నియమించేది.. మరి అలాంటప్పుడు ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించడంలో అర్థం ఉందా అని సీఎం కేసీఆర్ ( CM KCR ) బీజేపి నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. గెలుపు, ఓటములను హుందాగా స్వీకరించాలని సూచించారు.
Also Read : Rajagopal Reddy: ఓటు వేసే అవకాశం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి.. కారణం ఇదే..!
Also Read : Munugode By Elections: మునుగోడు పోలింగ్ అప్‌డేట్.. చండూరులో ఉద్రిక్తం.. టీఆర్ఎస్ నేతలు పరార్..?
Also Read : Munugode Bypoll: మునుగోడు పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తం.. బండి సంజయ్ అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి