CM KCR Speech from Kollapur: నేడు పండగ వాతావరణంలో అట్టహాసంగా జరిగిన పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల పథ‌కం ప్రారంభోత్సవం కార్యక్రమం అనంత‌రం కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగిస్తూ పాలమూరు ప్రాజెక్టు చరిత్ర గురించి, ప్రాజెక్టు గురించి పాలమూరు గడ్డపై పుట్టిన బిడ్డలు కన్న కలల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, రంగారెడ్డి జిల్లాల చ‌రిత్ర‌లోనే నేడు సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ రోజు ఇది అని వ్యాఖ్యానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, " ఒక‌ప్పుడు ఇదే పాల‌మూరు గడ్డపై బతకలేక ఈ గడ్డపై పుట్టిన బిడ్డలు హైద‌రాబాద్‌లో అడ్డా కూలీలుగా మారారని... కానీ స్వరాష్ట్రం వచ్చాకా పాలమూరు బతుకుచిత్రం మారిపోయిందని చెబుతూ ఆనాటి కష్టాలను సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు పాలమూరు నుండి ఇక్కడి వాళ్లు బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు వలసపోతే.. ఇప్పుడు వేరే ప్రాంతాల నుండే ఇక్కడికి బతుకుదెరువు కోసం వస్తున్నారని అన్నారు. స్థానిక రైతులు త‌మ పొలం పనులు చేసుకుంటుంటే.. స్థానిక రైతు కూలీలకు కూడా ఇక్కడే ప‌ని దొరుకుతోంది " అని అన్నారు. 


తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా తాను పాలమూరుకి వచ్చినప్పుడు ఇక్కడి ప్రాంత వాసులతో మాట్లాడుతూ, రాష్ట్రం వ‌స్తేనే మనల్ని పట్టి పీడిస్తున్న స‌క‌ల ద‌రిద్ర‌లు విడిచిపెడతాయని అన్నానని.. మన రాష్ట్రం మనకు వస్తేనే మ‌న హ‌క్కులు, మన నీళ్లు మనకు దక్కుతాయని చెప్పానని గుర్తుచేసుకున్నారు. తాను పాల‌మూరు ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాను అని చెబుతూ ఉద్యమంలో తనకు పాలమూరుతో ఉన్న అనుబంధాన్ని, ఆ రోజులను నెమరువేసుకున్నారు. 



 


కాళేశ్వ‌రం ప్రాజెక్ట్, సీతారామ‌ ప్రాజెక్ట్, పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌ పథకం.. ఈమూడు ప్రాజెక్టులు పూర్త‌యితే తెలంగాణ‌ వ‌జ్రపు తున‌క‌ అవుతుందన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల ఆయకట్టు కింద పండే పంటలతో తెలంగాణ యావత్ దేశానికే అన్నం పెడుతుందని సగర్వంగా ప్రకటించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని సవాళ్లు ఎదురైనా.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. అలాగే సీతారామ ప్రాజెక్టు ప‌నులు కూడా చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి అని తెలిపారు.


ఇది కూడా చదవండి : CM KCR at Palamuru project: నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద మహా బాహుబలి మోటార్స్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్


పాల‌మూరు ఎత్తిపోత‌ల పథకం పనులు కూడా నాలుగేళ్ల కింద‌నే పూర్త‌ి కావాల్సి ఉన్నప్పటికీ.. ఇదే గడ్డపై ఉన్న కొంతమంది గ‌త్త‌ర బిత్త‌ర నాయ‌కులు అడ్డుకుంటూ వచ్చారని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తమ రాజకీయ ప్రత్యర్థులపై కొల్లాపూర్ సభా వేదికపై నుండి సీఎం కేసీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇలా ఎన్ని సవాళ్లు ఎదురైనా అంతిమంగా పాలమూరు ప్రాజెక్టు ఇలా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది అని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు.


ఇది కూడా చదవండి : Palamuru Project: ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పాలమూరు ప్రాజెక్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి