BRS Praja Ashirvada Sabha Highlights: అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజాస్వామ్య పరిణతి వచ్చిందని.. మనదేశంలో ఇంకా రావాల్సినంతగా రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ఓటు అనే ఆయుధాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించారు. ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్‌లో జరిగిన ప్రజా ఆశ్వీరద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలే కాదు.. వారి వెనుకున్న పార్టీల గత చరిత్ర చూసి, ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం కేసీఆర్ స్పీచ్ హైలెట్స్..


==> కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణాలో కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు లేవు. చాలామంది ప్రజలు బతుకపోయేది. రైతుల ఆకలిచావులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు.. అనేక సమస్యలు ఉండేవి.
==> అప్పటి తెలంగాణ సమస్యలపై చాలా మేధోమథనం చేసి, ఒక పంథాలో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వెళుతున్నాం.
==> వందల రూపాయలున్న పెన్షన్ ను వేల రూపాయలకు తీసుకెళ్లాం.
==> కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కండ్లముందు జరుగుతున్నయి.
==> రైతు సంక్షేమానికై దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన పాలసీని తీసుకున్నాం.
==> నాడు రైతులకు నీటి తీరువా ఉంటే..బీఆర్ఎస్ ప్రభుత్వం పాత బకాయిలను మాఫీ చేయడమే కాకుండా, దానిని పూర్తిగా రద్దు చేసింది.
==> వ్యవసాయ స్థిరీకరణలో భాగంగానే నీటి తీరువా తీసేసి, 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం. రైతు బంధు పెట్టుబడి సమకూర్చి, పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది.
==> దురదృష్టవశాత్తూ రైతు చనిపోతే, రైతు కుటుంబం ఆగం కావొద్దని రైతు బీమాను ఏర్పాటు చేసి రూ.5 లక్షలు అందేలా చేశాం.
==> పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్.. కేసీఆర్ కు ఏం పనిలేదు..రైతు బంధు ఇచ్చి పైసలన్నీ దుబారా చేస్తున్నడని అంటున్నడు.
==> బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు వస్తది.
==> మన పరంగా ఎవరు యుద్ధం చేస్తరో వాళ్ల చేతిలో కత్తి పెడితేనే మనం గెలుస్తం.
==> కత్తి ఒకరికి ఇచ్చి.. వేరొకరిని యుద్ధం చేయాలంటే సాధ్యం కాదు.
==> ఎమ్మెల్యేలు గెలిస్తేనే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతది. 
==> రైతుల భూములు ఆగం కావొద్దని ధరణి’ తెచ్చాం. 
==> గతంలో రైతుల బతుకులు వీఆర్వో, గిర్దావర్, ఎమ్మార్వో, ఆర్డీవో.. ఎందరో దళారులు, పైరవీకారుల చేతుల్లో నలిగిపోయేవి.
==> కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడైన రాహూల్ గాంధీయే స్వయంగా ధరణిని తీసి బంగాళాఖాతంలో వేయమంటుండు.
==> ధరణితో రైతులు, ప్రజల భూములు భద్రంగా ఉన్నయ్. మండలాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ వెంటనే అయిపోతున్నది.
==> కాంగ్రెస్ నాయకులు బాధ్యత లేకుండా దళారీలు, పైరవీకారుల రాజ్యం కోసం ధరణిని తీసేస్తామంటున్నరు.
==> మేం కరెంటు, ధరణి తీసేస్తమని చెప్పినా మాకే ఓట్లేసినం అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తది.
==> 15 ఏండ్లు కాంగ్రెస్ తిప్పలబెడితే.. సచ్చుడో..బతుకుడోనని.. దీక్షబట్టి చావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన. 
==> తెచ్చిన తెలంగాణలో బీదాబిక్కీ, చిన్నాపెద్దా.. కుల మతాలకతీతంగా అందర్నీ కలుపుకొని తెలంగాణను ఒక దరికి తెస్తున్నాం.
==> ఈ దుర్మార్గులు వచ్చి మళ్లా నాశనం చేవొద్దనేదే నా బాధ.
==> కరెంటు కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా..? రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా..? ఏది కావాల్నో ప్రజలు చర్చబెట్టి నిర్ణయించుకోవాలి.." అని సీఎం కేసీఆర్ అన్నారు.


Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి