ఫిబ్రవరి 11 న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ, కొత్తవారికి పోస్టింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 11న ప్రగతి భవన్ లో కలెక్టర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ, కొత్తవారికి పోస్టింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 11న ప్రగతి భవన్ లో కలెక్టర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒకేసారి ఏకంగా 56 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు ముగియడంతో సీఎం కె.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) 21 జిల్లాల కలెక్టర్లతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు టీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో కొత్త మున్సిపల్ చట్టంపై కేటీఆర్ అవగాహన కల్పించనున్నారు.
త్వరలో జరుగనున్న సహకార సం ఘాల ఎన్నికల్లోనూ దూసుకెళ్లాలనీ, అన్ని సొసైటీలనూ టీఆర్‌ఎస్ మద్దతుదారులే గెలుచుకోవాలని తెలంగాణ పిలుపునిచ్చింది.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..