CM KCR Delhi Protest: ఇవాళ ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష... కేంద్రంపై సమరశంఖం పూరించనున్న టీఆర్ఎస్ సర్కార్
CM KCR Delhi Protest: యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ ఇవాళ ఢిల్లీ వేదికగా నిరసన దీక్షకు సిద్ధమైంది. కేంద్రంతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో `రైతుల పక్షాన నిరసన దీక్ష` చేపట్టనుంది.
CM KCR Delhi Protest: యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ ఇవాళ ఢిల్లీ వేదికగా నిరసన దీక్షకు సిద్ధమైంది. కేంద్రంతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 'రైతుల పక్షాన నిరసన దీక్ష' చేపట్టనుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ దీక్ష జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ నిరసన దీక్షకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు.
నిరసన దీక్షకు పూర్తయిన ఏర్పాట్లు :
తెలంగాణ భవన్‌లో చేపట్టే నిరసన దీక్షకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీక్ష కోసం 40 అడుగుల వేదికను సిద్దం చేశారు. వేదిక కింద 2 వేల మందికి పైగా కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. వేదిక సమీపంలోనే తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపాలను కూడా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ మొదట అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి వేదిక పైకి చేరుకుంటారు. వేదికపై సీఎం కేసీఆర్‌తో పాటు కొద్ది మంది నేతలే ఉండనున్నారు.
ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని నిలదీస్తూ ఫ్లెక్సీలు:
తెలంగాణ రైతులకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని తెలియజేసేలా ఢిల్లీ వీధుల్లో టీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యావత్ దేశానికి తెలంగాణ సమస్య తెలియజేసేలా ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగే నిరసన దీక్షకు రైతు నేత రాకేశ్ టికాయిత్ కూడా హాజరుకానున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు డిమాండ్ చేస్తూ ఇప్పటికే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయిల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టిన టీఆర్ఎస్ ఇప్పుడు ఢిల్లీలో సమరశంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. అయితే ఇవాళ్టి దీక్ష తర్వాత కూడా కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోతే టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: AP New Cabinet: మరి కాస్సేపట్లో కొలువుదీరనున్న ఏపీ కొత్త కేబినెట్, మంత్రుల జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook