KTR on Paddy Procurement Issue: వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో పోరుకు సిద్ధమవుతోన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదంచెల యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ నెల 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న జాతీయ రహదారులపై రాస్తారోకో, 7న జిల్లా కేంద్రాల్లో, 8న గ్రామ పంచాయతీల్లో నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. చివరగా, ఏప్రిల్ 11న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమాన్ని చేపట్టనుంది. మంత్రి కేటీఆర్ శనివారం (ఏప్రిల్ 2) నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీలో నిరసన చేపడుతామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కేంద్రం కొనుగోలు చేసేదాకా రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం పెద్ద మనసు చేసుకుని నిబంధనలు పెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు.
ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్లకు కొమ్ముకాసే ప్రభుత్వమని... రైతుల బాధ వారికి పట్టదని అర్థమైందన్నారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేయమంటోందని... వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని గతంలో మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు సూచించినట్లు గుర్తుచేశారు. ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... రైతులు వరే వేయాలని.. పండించిన ప్రతీ గింజ కేంద్రంతో కొనిపించే బాధ్యత తనదేనని ప్రగల్భాలు పలికారన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో దేశంలో ఒకే పాలసీ ఉండాలన్నారు కేటీఆర్. వన్ నేషన్.. వన్ రేషన్ తరహాలో వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ఎందుకు ఉండకూడదన్నారు. పంజాబ్‌లో పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసినప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు కొనుగోలు చేయరని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read: Srilanka Crisis: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం... దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ..
Also Read: Revanth Reddy: తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణశాసనం, ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook