CM KCR: కేంద్రానికి కేసీఆర్ వార్నింగ్... 24 గంటల డెడ్ లైన్.. స్పందించకపోతే భూకంపమే..
CM KCR Speech in Delhi Protest: ఢిల్లీ నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ గర్జించారు. కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ విధించారు. ఆలోగా సానుకూల స్పందన రాకపోతే ఏం చేయాలో అది చేసి చూపిస్తామన్నారు.
CM KCR Speech in Delhi Protest: వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి పీయుష్ గోయల్‌లకు తెలంగాణ రైతాంగం తరుపున సీఎం కేసీఆర్ రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పండిన ప్రతీ గింజను కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. 24 గంటల్లో కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందించాలని అన్నారు. ఒకవేళ స్పందించకపోతే ఏం చేయాలో అది చేసి చూపిస్తామని... దేశంలో భూకంపం సృష్టిస్తామని... ఇకపై కేంద్రం వెనకాలే పడుతామని హెచ్చరించారు.
తెలంగాణ మంత్రుల బృందం వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రమంత్రి పీయుష్ గోయల్‌ను కలిసేందుకు వెళ్తే.. ఆయన తెలంగాణ ప్రజలను నూకలు తినమని అవమానించారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఇదేనా మర్యాద అంటూ నిలదీశారు. ఆయన పీయూష్ గోయల్ కాదు... పీయూష్ గోల్‌మాల్ అని ఎద్దేవా చేశారు. అసలు వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఆయన అవగాహన ఏంటో... ఆయనకేం అర్థమవుతుందో తెలియట్లేదన్నారు.
ముఖ్యమంత్రినైన తనను జైలుకు పంపిస్తామని మాట్లాడుతున్నారని... దమ్ముంటే రావాలని... జైలుకు పంపాలని సవాల్ విసిరారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. బీజేపీ అసలు నైజాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీ దాడులు అంటూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఒక్క బీజేపీ నేతపై కూడా ఈడీ, సీబీఐ దాడులు జరగట్లేదన్నారు. రైతులతో పేచీలు బీజేపీకి తగవని... ఇకనైనా ఒకే దేశం ఒకే ధాన్యం సేకరణ విధానానికి బీజేపీ పూనుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
Also Read: Amazon Sale: రూ.4 వేల విలువైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.899లకే.. ఆఫర్ ఒక్కరోజు మాత్రమే!
Also Read: IRCTC Booking: IRCTC వెబ్ సైట్ ద్వారా ఒకే నెలలో ఎక్కువ టికెట్లు బుక్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook