Bandi Sanjay on CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పెద్ద అవినీతిపరుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్‌పై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోందని.. ఆయన్ను జైలుకు పంపించడం ఖాయమని అన్నారు. ఈ విషయం తెలిసే కేసీఆర్ ఫ్రంట్ పేరుతో మళ్లీ హడావుడి మొదలుపెట్టారని విమర్శించారు. అవినీతిపరులంతా ఒకే గొడుగు కిందకు చేరుతున్నారని... ఇందులో భాగంగానే కమ్యూనిస్టులు, తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) కేసీఆర్‌తో భేటీ అయ్యారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదని.. ఆయన జిమ్మిక్కులను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక్కడే ఫాంహౌస్ నుంచి బయటకు రాని వ్యక్తి... ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తారని.. ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) అవినీతిపరుల కోసం ట్రైనింగ్ క్యాంపు పెట్టినట్లున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అంతా కలిసి 'దోచుకోండి... దాచుకోండి...' అని పార్టీ పెడుతారేమోనని విమర్శించారు. 'నువ్వు ములాయం కొడుకును తెచ్చుకుంటావా... లాలూ ప్రసాద్ కొడుకును తెచ్చుకుంటావా... లేక  తాలిబన్లు, రోహింగ్యాలు, ఆల్‌ఖైదాలను తెచ్చుకుంటావా.. ఎలాగైనా నిన్ను వదిలే ప్రసక్తే లేదు...' అని పేర్కొన్నారు.


కేసీఆర్‌ను ఇప్పటికే అందరూ పిచ్చోడని అనుకుంటున్నారని సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. కేంద్రం ఆయనపై చర్యలకు సిద్దమవుతోందనే విషయం తెలిసే అందరినీ పిలిపించుకుంటున్నాడని అన్నారు. కేసీఆర్ స్థాయి ఏంటో అందరికీ తెలుసునని... ఇకనైనా జిమ్మిక్కులు బంద్ చేయాలని అన్నారు. 


వివేకానంద స్పూర్తితో యువత ముందుకు సాగాలి : బండి సంజయ్


తెలంగాణ యువత స్వామి వివేకానంద స్పూర్తితో (National Youth Day 2022) ముందుకు సాగాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. భారత జాతి ఔన్నత్యాన్ని, హిందుత్వ శక్తిని ఖండాంతరాలు దాటించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. తెలంగాణలో గడీల పాలనలో యువత జీవితం నిర్వీర్యం అవుతోందని అన్నారు. కాబట్టి యువత వివేకానంద స్పూర్తితో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డబ్బులు లేనోడు పేదోడు కాదని... ఆశయం లేనోడు పేదోడని స్వామి వివేకానంద చెప్పిన మాటలను యువత స్పూర్తిగా తీసుకోవాలన్నారు.


Also Read: Shahid Afridi Sex Scandal: ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఫ్యాన్ గర్ల్ తో పాకిస్థానీ క్రికెటర్ రాసలీలలు- వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook