Cm Revanth  Reddy big sketch on pcc chief post: తెలంగాణలోని పీపీసీ పదవిలో భారీ మార్పులు ఉండబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో.. ఆయన ఎన్నికలు రిజల్ట్ రాగానే కాంగ్రెస్ పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పదుల సంఖ్యలో సీనియర్లు పీసీసీ చీఫ్ పదవి కోసం లాబీయింగ్ లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎవరికి వారే ఢిల్లీ వేదికగా మంతనాలు చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదిలా ఉండగా..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవి.. మంత్రి సీతక్కకు ఇచ్చేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. మంత్రి సీతక్క ట్రైబల్ కమ్యునిటీకి చెందినవారు కావడం వల్ల ఆమెకు ఎక్కువగా మంది సపోర్ట్ గా ఉంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఎక్కువ మంది పీసీసీ చీఫ్ పదవిలో రెడ్డి సామాజిక వర్గం, ఇతర వర్గాల వారే ఎక్కువగా  ఉన్నారని, ఈ నియామకంలో ఈ అపఖ్యాతీని పోగొట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ప్రచారం జరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..


తెలంగాణలో సీఎం రేవంత్ కు , డిప్యూటీ సీఎంకు అస్సలు పడట్లేదని గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని కూడా తరచుగా ప్రచారం జరుగుతు ఉంటుంది. ఈ క్రమంలో.. 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీచరిత్రలో రెడ్డీస్ ల డామినేషన్ కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. కాంగ్రెస్ లోనే ఎవరికి వారే.. ఒకరిపై మరోకరు తరచుగా విమర్శలు చేసుకుంటు ఉంటారు.ఈ నేపథ్యంలో సీతక్కకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే కాంగ్రెస్ కు ప్రజల్లో మరింత మైలేజీ ఉంటుందనికూడా భావిస్తున్నారు.


మరోవైపు మంత్రి సీతక్క తొలి నుంచి కూడా సీఎంరేవంత్ కు నమ్మిన బంటు అని ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సీతక్క తన గొంతు విన్పించడానికి ప్రయత్నించేవారు. బీఆర్ఎస్ ను తనదైన స్టైల్ లో అనేక మార్లు ఇరుకున పెట్టే ప్రయత్నంచేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్కకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే, సీనియర్ల నుంచి వ్యతిరేకత ఉండకపోవచ్చంటూ కూడా సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే... ఇప్పటికే టీపీసీసీ నుంచి ఏఐసీసీ కి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లిపోయినట్లు కూడా సమాచారం.


Read more: May 27 Holiday: మే 27 సోమవారం వాళ్లందరికి సెలవు.. కారణం ఏంటో తెలుసా..?


కాంగ్రెస్ పార్టీ అంటే లాబీయింగ్ లకు పెట్టింది పేరని, ఎవరికి వారే తమదైన స్టైల్ లో ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేస్తుంటారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తన దైన స్టైల్ లో ప్రస్తుతం ముందుకు దూసుకుపోతున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకవైపు బీఆర్ఎస్ ను ఏకీపారేస్తునే, మరోవైపు ప్రజలకు మెరుగైన పాలన కోసం తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై ప్రస్తుతం ఎవరు అధిష్టిస్తారనేదానిపై మాత్రం మరికొన్నిరోజుల్లో క్లారిటీ రానుంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter