Revanth Reddy VS KCR: కేసీఆర్ కాస్కో.. నిన్ను మళ్లీ గడ్డమీద మొలవనివ్వ.. కాక రేపుతున్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. వీడియో ఇదే..
Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. గులాబీ బాస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా.. ఏకీ పారేశారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ మొక్క మొలవనివ్వనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
cm revanth reddy fires on brs kcr in warngal: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు చలికాలంలో కూడా హీట్ ను పుట్టిస్తున్నాయి. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా, వరంగల్ లో .. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గులాబీ బాస్ పై మళ్లీ రెచ్చిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో కాకరేపుతున్నాయని చెప్పుకొవచ్చు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అన్ని రంగాల్లో తెలంగాణకు వెనక్కు నెట్టివేశారన్నారు. అంతే కాకుండా.. కేసీఆర్ కు మహిళలంటే.. చులకన అని ఎద్దేవా చేశారు. తాము తమ మంత్రి వర్గంలో మహిళలకు పెద్ద పీట వేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం అయ్యాడని, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదన్నారు.
తాము.. వరంగల్ ను అన్ని రంగాలలో డెవలప్ చేస్తామన్నారు. ఎయిర్ పొర్టు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ కిరాయి గుండాలతో తెలంగాణ డెవలప్ మెంట్ ను అడ్డుకుంటున్నారని విమర్శించారు. కొన్ని సాంకేతిక కారణాలలో రుణమాఫీలో జాప్యం ఏర్పడిందని ఆరునూరైన.. మహిళలకు రుణమాఫీ తప్పకుండా చేస్తామన్నారు. అంతే కాకుండా..మహిళల్ని కోటీశ్వరుల్ని చేసే దిశగా తమ సర్కారు కంకణం కట్టుకుందని అన్నారు.
గత సర్కారు పదేళ్ల హాయాంలో కాళోజీ కళా క్షేత్రాన్ని డెవలప్ చేయలేదన్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం కాళోజీ కళా క్షేత్రాన్ని పూర్తి చేసిందన్నారు. అంతే కాకుండా.. ప్రజలు ఓడిస్తే.. ఫామ్ హౌస్ లోనే ఉంటారా..అని ప్రశ్నించారు. తమ అధినేత రాహుల్ గాంధీ ఓడిపోయిన కూడా.. ప్రజల మధ్యలోనే ఉంటూ పాదయాత్రలు చేశారని విషయం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఎప్పుడో మర్చిపోయారన్నారు. ఉద్యమాల పొరుగడ్డ అయిన వరంగల్ ఉత్తర తెలంగాణ వరప్రదాయినిని గత పాలకులు మర్చిపోయారన్నారు.
Read more: Viral Video: స్మిత గారు.. మీకోసమే అంటూ ఎక్స్ లో పోస్ట్... నెట్టింట రచ్చగా మారిన వీడియో.. ఏముందంటే..?
అంతే కాకుండా.. మళ్లీ గడ్డమీద కేసీఆర్ మొక్కను మొలవనివ్వనంటూ కూడా రేవంత్ రెచ్చిపోయారు. గుజరాత్ లో సబర్మతి సుందరీకరణను సమర్థించి.. తెలంగాణలో మూసీ సుందరీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఊడిగం చేస్తున్నారని, తెలంగాణ పట్ల చిత్తశుధ్దిలేదన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ లో పలు డెవలప్ మెంట్ పనులకు రేవంత్ శంకుస్థాపనలు చేశారు. అంతే కాకుండా.. కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభించారు . కాళోజీ జీవిత చరిత్రలోన పలుఘాట్టాలను ఫోటో ఎగ్జిబిషన్ ను రేవంత్ మంత్రులు తిలకించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.