Rythu Bandhu Funds Released: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టిన ముఖ్యమంత్రి.. అందులో రెండు గ్యారంటీలను అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరో గుడ్‌న్యూస్ చెప్పారు. ఎన్నికలకు ముందు నిలిచిపోయిన రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం వ్యవసాయ శాఖపై డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు నేటి నుంచే రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో వేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా  పంట పెట్టుబడి సహాయం అందించాలన్నారు. అదేవిధంగా రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు.


ప్రస్తుతం జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజా దర్బర్‌ను ఇక నుంచి ప్రజావాణిగా పిలవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటలలోపు జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ వద్దకు చేరుకున్న వారందరికీ అవకాశం ఇవ్వాలన్నారు. దివ్యాంగులకు, మహిళకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు తాగునీటితో సౌకర్యంతోపాటు ఇతర వసతులు కల్పించాలని సూచించారు. 


Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి