Manuguru Praja Deevena Public Meeting: భద్రాద్రి శ్రీరాముడి ఆశీస్సులతో ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మణుగూరు ప్రజా దీవెన సభలో మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా ఖమ్మం జిల్లా ప్రజలు అండగా నిలబడి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని అన్నారు. తనతో రక్త సంబంధం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీ రక్తాన్ని చెమటగా మార్చి పని చేశారని చెప్పారు. ఇచ్చిన మాట తప్పని నాయకురాలు  సోనియా గాంధీ అని.. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పదేళ్లలో దొంగ హామీలతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఖమ్మం జిల్లా ప్రజలు మొదటి నుంచి బీఆర్ఎస్‌ను నమ్మలేదని.. ఈ జిల్లా ప్రజలు చైతన్యంతో కాంగ్రెస్‌ను గెలిపించి బీఆర్‌ఎస్‌ను బొందపెట్టారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Viral Video: స్టేజ్ మీద కొడుకు యాక్టింగ్.. కింద తండ్రి ఆనంద భాష్పాలు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో..  


"మీ అందరి ఆశీర్వాదంతో మహబూబాబాద్ పార్లమెంట్‌లో లక్షా 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయం.. ప్రతీ తలుపు తట్టండి.. సోనియామ్మా మాటను ప్రతీ ఇంటికి చేరవేయండి.. ఇందిరమ్మ రాజ్యంలో రూ.500 లకే సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నాం.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం.. మీ కళ్లల్లో వెలుగులు.. గుండెల్లో ఆనందం చూడాలని జీరో బిల్లులు జారీ చేశాం.. పదేళ్లలో మీకెవరికైనా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇచ్చారా..? నేను మంచి చేస్తుంటే చూసి ఓర్వలేక తండ్రీకొడుకులు, మామా-అల్లుళ్లు, తండ్రి-కూతురు శాపనార్థాలు పెడుతుండ్రు. పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదు.


మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అంటూ మనకు నీతులు చెబుతున్నారు. పదేళ్లయినా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. సిగ్గులేని కేటీఆర్ ఏనాడైనా ఆలోచించావా..? ఎప్పుడైనా ఇంటికెళ్లి మీ అయ్యను అడిగినవా కేటీఆర్..? 90 రోజుల్లోనే గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నాం.. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించాం.. పేడమూతి బోడిలింగానికి నేను చెబుతున్నా.. బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి.. మీరంతా తొడుదొంగలు.. రాష్ట్రాన్ని కొల్లగొట్టిన దోపిడీ దొంగలు మీరు..


ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకు తాగు నీరు లేని పరిస్థితి తీసుకొచ్చారు. వీళ్లా మా గురించి మాట్లాడేది..? బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయి. బీజేపీ ప్రకటించిన 9 సీట్లలో బీఆర్ఎస్ తమ అభ్యర్థులను  ప్రకటించడంలేదు. బీఆర్ఎస్ ప్రకటించిన 4 సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంలేదు. వీళ్ల అవగాహన ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నామాను ఎందుకు ప్రకటించలేదు..? మీ పార్టీకి దిక్కులేదా..? పక్కనే సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను ఎందుకు ప్రకటించలేదు..? ఆమెకు టికెట్ ఇవ్వరా..? కేసీఆర్, హరీష్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకడం లేదా..? నిజామాబాద్‌లో మీ బిడ్డకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదు..? ప్రజలు మళ్లీ బండకేసి కొడతారని అనుమనమా..? సికింద్రాబాద్‌లో గతంలో పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ కొడుక్కు టికెట్ ఎందుకు ఇవ్వడంలేదు.. కలిసి కనిపిస్తే ప్రజలు చెప్పుతో కొడతారని బీజేపీతో చీకట్లో ఒప్పందం చేసుకుని.. మోడీ, కేడీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తుండ్రు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లు కాంగ్రెస్ గెలవబోతుందనే కలిసి కుట్రలు చేస్తున్నారు.


కేసీఆర్.. మేం తలచుకుంటే.. గేట్లు తెరిస్తే.. నీ ఇంట్లో వాళ్లు తప్ప అంతా కాంగ్రెస్ కండువా కప్పుకుని మాకు అండగా నిలబడతారు.. మేం రాజనీతిని పాటించాలనుకుంటున్నాం.. కానీ మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేడీ కలిసి కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకుంటామనుకోకండి.. మాకు లోతు తెలుసు.. ఎత్తు తెలుసు.. చివరగా ఒక్క మాట చెబుతున్నా.. మాతో గోక్కోవద్దు.. గోక్కునోళ్లు ఎవరూ బాగుపడలేదు.. మా కార్యకర్తల చేసే చప్పుడుకు మీ గుండెలు అదురుతాయ్ బిడ్డా.. మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్‌ను లక్షా 50 వేల మెజార్టీతో గెలిపించండి.." అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


Also Read: CAA Implement: మోదీ ప్రభుత్వం సంచలనం.. ఎన్నికల వేళ సీఏఏ అమలుకు నిర్ణయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter