Viral Video: స్టేజ్ మీద కొడుకు యాక్టింగ్.. కింద తండ్రి ఆనంద భాష్పాలు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో..

Emotional video: కొడుకే ప్రపంచంగా బతుకుతాడు తండ్రి. కుమారుడిని మంచి స్థాయిలో చూడాలని అనుక్షణం కష్టపడుతుంటాడు. చిన్నప్పటి నుంచి కుమారుడికి కావాల్సిందల్లా ఇస్తాడు. అదే కొడుకు ప్రయోజకుడైతే ఆ తండ్రి ఆనందం మాటల్లో చెప్పలేం. అలాంటి ఎమోషనల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2024, 10:46 PM IST
Viral Video: స్టేజ్ మీద కొడుకు యాక్టింగ్.. కింద తండ్రి ఆనంద భాష్పాలు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో..

Viral Video today:  కుమారుడు మంచి స్థాయికి వెళ్లాలని చిన్నప్పటి నుంచి అతడికి కావాల్సిందల్లా ఇస్తాడు తండ్రి. కుమారుడు ప్రయోజకుడైతే ఆ తండ్రీ కళ్లలో కలిగే ఆనందమే వేరు. కొడుకు విజయాన్ని తన విజయంగా సెలబ్రేట్ చేసుకుని మురిసిపోతాడు. ప్రస్తుతం అలాంటి ఎమోషనల్ వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. ఇందులో కుమారుడు స్టేజ్ మీద ప్రదర్శన ఇస్తుంటే.. కింద తండ్రి చిన్న పిల్లాడిలా కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

వీడియో ఓపెన్ చేస్తే.. వేదిక మీద ఓ కుర్రాడి ప్రదర్శన చూసి కింద ఆడియెన్స్ మధ్య నిలబడి ఉన్న అతడి తండ్రి భావోద్వేగానికి లోనవుతాడు. కొడుకు యాక్టింగ్ కు పట్టరాని సంతోషంతో చప్పట్లు కొట్టడంతోపాటు కన్నీళ్లు కూడా పెట్టుకుంటాడు. ఈ ఎమోషనల్ వీడియో నెటిజన్స్ ను కదిలిస్తోంది. ఈ వీడియోను @ShoneeKapoor అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్స్ లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  ఇప్పటి వరకు ఈ వీడియోను 3.8 లక్షల మంది వీక్షించగా.. 12 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మా నాన్న గుర్తుచ్చొడు' అని ఒకరంటే.. 'ఆ తండ్రి ప్రపంచాన్ని జయించినట్లు ఫీలవుతున్నాడని' మరోకరు కామెంట్ చేశారు. 

Also Read: Viral News: ఇదెక్కడి విడ్డూరం! ఒక్క నిమ్మకాయ ధర రూ.35 వేలా..!

ఇంటర్నెట్ వచ్చాక ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ను చూపించాలనుకుంటున్నారు. లైక్స్, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం రిస్క్ లో పెడుతున్నారు. ఇప్పటి యువతకు సోషల్ మీడియానే ప్రపంచం అయిపోయింది తెల్లారి మెుదలు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లోనూ, వాట్సాఫ్ లోనూ, ఫేస్ బుక్ లోనూ మునిగితేలుతున్నారు. ఇందులో ఫేమస్ అయితే చాలా ప్రపంచాన్ని జయించినట్లు ఫీలవుతున్నారు. అందుకే చిత్ర విచిత్ర వీడియోలు షేర్ చేస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఇలాంటి ఎమోషనల్ వీడియోలను కూడా షూట్ చేస్తూ తమలోని కళానైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. 

Also Read: Viral Video today: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఆటోవాలా.. షాక్ అయిన ఫారిన్ వాలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News