cm revanth reddy takes key decisions in cabinet meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఒక వైపు ఆరు గ్యారంటీలు అమలు దిశగా ముందుకు వెళ్తునే, మరోవైపు బీఆర్ఎస్ ను ఏకీ పారేస్తున్నారు. గత సర్కారు హాయాంలో జరిగిన అక్రమాలను బైటకు తీసే పనులు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిందని చెప్పుకొవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే కాంగ్రెస్ మహిళలకు బస్సులలో ఉచిత పథకంను అమలు చేస్తున్నారు. అంతే కాకుండా.. తాము ఇచ్చిన హమీలన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటు వస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా..తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యంకానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని ఏకీ పారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇచ్చిన హమీలు నెరవేర్చేదాక వేటాడతామంటూ కూడా కేటీఆర్ వార్నింగ్ ఇస్తునే ఉన్నారు.


ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. దీనిలో అనేక అంశాలపై నిర్ణయాలుతీసుకుంటారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా..    రైతు భరోసా విధి విధానాలపై తుది గైడ్ లైన్స్, రైతులకు పెట్టుబడి సాయం, శీతాకాలం బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తొంది.


దీనితో పాటు.. కొత్త రెవెన్యూ చట్టం, కులగణన, వీఆర్ఏల వ్యవస్థను మళ్లీ  ప్రారంభించడం,  హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంపై కూడా పలు నిర్ణయాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు,  ఎస్సీ వర్గీకరణలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తొంది. దీనితో పాటు  ఉద్యోగ సంఘాలు జేఏసీ ఇటీవల సీఎం రేవంత్ ను కలిసి తమ డిమాండ్ లను పరిష్కరించాలని కూడా సీఎం రేవంత్ ను రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


ముఖ్యంగా 51 డిమాండ్ లు, పెండింగ్ లో ఉన్న ఐదు డీఏల విషయంలో నిర్ణయం తీసుకొవాలని ఉద్యోగ సంఘాలు కోరాయంట. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ సర్కారు.. ఉద్యోగ సంఘాలకు  2 డీఏలపై మాత్రం హమీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. డీఏలు, పీఎర్సీలపై కెబినెట్ లో చర్చించి సీఎం రేవంత్ ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు జరపనున్నారని తెలుస్తొంది.


Read more: TGPSC Group 1 Mains: గ్రూప్ 1 ఎగ్జామ్‌లో షాకింగ్.. చీర కొంగులో చిట్టీలు పెట్టుకుని మహిళ కాపీయింగ్.. ఎక్కడంటే..?


ధరణి స్థానంలో వస్తున్న భూమాత పొర్టల్ కు ఇంకా ఎలాంటి మార్పులు, చేర్పులు తీసుకొని రావాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మంత్రులు, అధికారులతో చర్చించి దీపావళి వేళ పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. దీనిలో తీసుకునే నిర్ణయాలపై ప్రస్తుతం సర్వాత్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకొవచ్చు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter