TGPSC Group 1 main examination: తెలంగాణలో ఇటీవల గ్రూప్ ఎగ్జామ్ లు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాాగా, జరిగిన ఎగ్జామ్ లో ఒక మహిళ మాస్ కాపీయింగ్ పాల్పడుతూ దొరికిపోయినట్లు తెలుస్తొంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్కారు కొలువులు వస్తాయని చాలా మంది భావించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్కారు కొలువు కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు అనేక ట్విస్ట్ లు ఎదురయ్యాయని చెప్పుకొవచ్చు.
తెలంగాణలో గత కొన్నేళ్లుగా గ్రూప్ ఎగ్జామ్ లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. గ్రూప్ 1, 2, 3 లు కూడా ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడిన విషయం తెలసిందే. అయితే.. గ్రూప్ 1 అభ్యర్థుల బాధలు మాత్రం వర్ణానాతీం.
దాదాపు పదేళ్ల తర్వాత తాజాగా, గ్రూప్ 1 ఎగ్జామ్ లు ప్రారంభమయ్యాయి. అంతకుముందు అనేక నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. గ్రూప్ 1 అభ్యర్థులు ఎగ్జామ్ లను వాయిదా వేయాలని రచ్చ చేశారు.
ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ తోపాటు బీజేపీ పార్టీ కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ సెక్రెటెరియట్ ను సైతం ముట్టడించేందుకు ప్రయత్నించారు.
ఇన్ని అడ్డంకుల తర్వాత గ్రూప్ ప్రధాన పరీక్షలు అక్టోబర్ 21 నుండి 27 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇబ్రహీం పట్నంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మహాబూబ్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్మీ ఇస్లావత్ లో ఎగ్జామ్ కు హజరయ్యారు. ఆమె ఎగ్జామ్ మధ్యలో కాపీయింగ్ కు పాల్పడినట్లు తెలుస్తొంది.
ఆమె చీర కోంగులో చిటీలుపెట్టుకుని వచ్చారని, ఎగ్జామ్ మధ్యలో ఆమె చేస్తున్న వ్యవహారాన్ని ఇన్విజిలెటర్ గుర్తించారు. వెంటనే అక్కడున్న టీజీఎస్పీఎస్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. దీంతో టీజీఎస్పీఎస్సీ సదరు అభ్యర్థిని దగ్గర చిట్టీలు గుర్తించి, ఆమెను డిబార్ చేసినట్లు తెలుస్తొంది.