cm revanth reddy visiting Khammam floods areas villagers protest: తెలంగాణలో కుండపోతగా వర్షం కురుసింది. దీంతో జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎక్కడ చూసిన కూడా రోడ్ల మీదకు వచ్చిచేరిపోతున్నాయి. పలు ప్రాజెక్టులు, నదులు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. అనేక చెరువులు నిండిపోవడం వల్ల గండ్లు పడి, కాలనీలకు నీళ్లు వచ్చిచేరాయి. జాతీయ రహాదారులు సైతం.. వరదలో కొట్టుకుపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలోని ఖమ్మంలో వరద ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకొవచ్చు. ఖమ్మంలోని అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి. అక్కడి ప్రజలు ఆదివారంనాడు పలు ఏరియాలో భారీగా వరద నీరు రావడంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతేకాకుండా.. తమను ఆదుకొవాలని వీడియోల ద్వారా వేడుకున్నారు. ఖమ్మంలో ముగ్గురుమంతులు పొంగులేటి, భట్టీవిక్రమార్క, తుమ్మలనాగేశ్వర రావు ఉన్న కూడా.. . సరైన విధంగా స్పందించలేదని స్థానికలు వాపోతున్నారు. ప్రజలు తమకు ఏ నాయకుడు ఏంచేయాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కొంత మంది జేసీబీలలో ధైర్యంగా వెళ్లి వరదలో చిక్కుకున్న వారిని, జాగ్రత్తగా ఒడ్డుకు తెచ్చారు.


దీంతో వరదలో మూడో ఫ్లోర్ లు, నాలుగో ఫ్లోర్ లో ఉన్న వారు జాగ్రత్తగా బైటకు వచ్చారు.ఈ క్రమంలో ఖమ్మం ప్రజలు ప్రస్తుతం మంత్రులు, అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ కు నిరసన సెగ తగిలిందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా.. కొంత మంది స్థానికులు సీఎం రేవంత్ వరద ప్రభావిత ప్రాంతాలకు వచ్చినప్పుడు సీఎం డౌన్ డౌన్.. అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు.


Read more: Cm Revanth Reddy: స్కూళ్లకు సెలవులపై మరో బిగ్ అప్ డేట్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్..  


అయిన కూడా స్థానికులు వెనక్కు తగ్గకపోవడం ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ పోలీసుల్ని కూడా రంగంలోకి దింపి, నిరసన కారుల్ని కంట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ కు ఓటువేసి తప్పుచేశామని కూడా  ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.