Cm Revanth Reddy: స్కూళ్లకు సెలవులపై మరో బిగ్ అప్ డేట్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్..

Telangana: తెలంగాణలో ఇప్పటికి కూడా వరద ప్రభావం తగ్గలేదు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరదలపై మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తు బిజీగా ఉంటున్నారు.

1 /6

తెలంగాణకు వరద ముంచెత్తుతుంది. ఎక్కడ చూసిన కూడా రోడ్లమీదకు  భారీగా వరద నీళ్లు వచ్చిచేరుతున్నాయి. వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. సాధారణ జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది..  

2 /6

ఈ క్రమంలో సీఎం రేవంత్ ఈరోజు హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా వరదల నేపథ్యంలో మంత్రులు, అధికారులు ఎల్లవేళల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

3 /6

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో ఎప్పటికప్పుడు సీఎం మానిటరింగ్ చేస్తుఉండాలన్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, వాగులు, వంకలకు గండ్లు పడిన ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు.  మరోవైపు.. తెలంగాణలో వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.   

4 /6

వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయలని ఆదేశించారు. చని పోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని, మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే రూ. 3 వేల సాయం రూ.5 వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు.

5 /6

ప్రస్తుతం ఇప్పటికి కూడా పలు ప్రాంతాలలో వరద  కొనసాగుతుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశం ముగించుకుని రోడ్డు మార్గంద్వారా ఖమ్మంకు చేరుకున్నారు. అక్కడ వరదపరిస్థితిపై స్థానికులతో కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. 

6 /6

ఈ క్రమంలో ఇప్పటికే వాతావరణ శాఖ రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని కూడా అలర్ట్ ను జారీ చేసింది.ఈ నేపథ్యంలో.. ఆయా జిల్లాల కలెక్టర్ లు, అధికారులు స్థానిక పరిస్థితుల్ని బట్టి స్కూళ్లకు హలీడేల విషయంలో నిర్ణయం తీసుకొవాలని కూడా సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.