Telangana state Advisor post will gives to pocharam Srinivas reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకీ వరుస షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత, తీహర్ జైలులో రిమాండ్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం, ఛత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు వంటి అంశాలు.. కేసీఆర్, కేటీఆర్ మెడమీద కత్తిలాగా ఉన్నారు. ఈ క్రమంలో.. ఇటీవల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువకప్పుకుని గులాబీ బాస్ కు షాక్ ఇచ్చారు. అంతేకాకుండా.. తాను తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లోనే స్టార్ట్ చేశానని, చివరకు కాంగ్రెస్ లోనే చేరాంటూ కూడా అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Tomato Price increase: వామ్మో.. సెంచరీ దాటేసిన టమాటో ధరలు.. ఉల్లి కేజీ ధర ఎంతంటే.?..


రైతులకు కాంగ్రెస్ ఎంతో మేలు చేస్తోందని, అందుకే తాను పార్టీ మారినట్లు ఆయన చెప్పుకొచ్చారు. తనకు ఎలాంటి పదవులపై మోజు లేదని తెల్చిచెప్పారు. ఈ క్రమంలో.. పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ లో సముచిత స్థానం ఇస్తారని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఆయనకు ప్రభుత్వ సలహదారు పదవి ఇవ్వోచ్చని కూడా వార్తలలో సోషల్ మీడియాలో, రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో.. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే కేబినెట్ విస్తరణ జరుగనుంది. దీనిలో భాగంగానే... గతంలో మంత్రులుగా స్థానం దొరకని కీలక నేతలకు ఈ దఫా అవకాశం దొరకవచ్చని సమాచారం.


మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారంశ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు ఏకీపారేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. అన్నిరకాల హోదాలు, గౌరవం ఇచ్చిన కూడా పార్టీ మారడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణకు స్పీకర్ పదవితో ఇచ్చి, గులాబీబాస్ ఎంతో గౌరవంగా చూసుకున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోచారంను విమర్శిస్తున్నారు. పోచారం ఇంటిని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించడానికి ప్రయత్నించారు. మరోవైపు.. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చేశారు. గతంలో ఎంపీ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్.. కన్పించిన దేవుళ్ల మీదల్లా ప్రమాణం చేసి ఆగస్టు 15 కల్లా రైతుల రుణమాఫి చేస్తానంటూ హమీ ఇచ్చారు.


ఆ దిశగా ఇప్పుడు కేబినేట్ లో కూడా చర్చలు జరిపి, అధికారికంగా తెలియజేయడంతో తెలంగాణ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ పాలననచ్చే, పార్టీ మారినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాజాగా, పోచారం శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ లో చేరడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకించారు.


Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..


తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యే సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించట్లేదని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరిక అవకాశవాదానికి నిదర్శనంగా భావిస్తున్నన్నానని, ఇలాంటి వాటిని తాను ప్రోత్సహించనంటూ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెల్చి చెప్పారు.


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి