COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Komati Reddy Brothers - Uttam Kumar Reddy: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ రెండు రాజకీయ కుటుంబాలు మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఒకే పార్టీ ఐనా ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలో రాజకీయంగా తమదే పై చేయి కావాలని ఈ రెండు కుటుంబాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏమైందో ఏమో కానీ ఎవరూ ఊహించనట్టుగా తమ ప్రత్యర్థి నేతను ఉన్నత స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతాడని గంటా పథంగా చెప్పడం జిల్లాలో సంచలనంగా మారింది. ఉన్నట్లుండి ఆనేత తమ వైరి వర్గంగా భావించే నేతను అందరి ముందు ఇంతలా మునగ చెట్టు ఎక్కించడం వెనుక ఉన్న మతలబు ఏంటా అని జిల్లా నేతలు ఆరా తీస్తున్నారు..ఇంతకీ ఎవరా నేత..ఆయన చేసిన కామెంట్స్ ఏంటి...


కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. బిజినెస్ మెన్ గా ఉండి రాజకీయాలకు వచ్చిన నాయకుడైన రాజగోపాల్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే తన కంటూ ఓ పొలిటికల్ ఇమేజ్ ను ఏర్పర్చుకున్నారు.  సోదరుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రోద్భలం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2009లో రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాలకు వచ్చిరాగానే భువనగిరి ఎంపీగా  ఎన్నికయ్యారు. నాటి నుంచి రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా  ఎంపీగా తన వాయిస్ వినిపించారు.


తెలంగాణ ఏర్పాటు తర్వాత మాత్రం జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఎంపీగా ఓడినా ఎమ్మెల్సీ రూపంలో వచ్చిన అవకాశాన్ని రాజగోపాల్ రెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. నల్లగొండ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అలా రాజకీయంగా ఎప్పుడూ క్రియాశీలంగా ఉంటూ వస్తున్నారు. అప్పటికే సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో తన కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పర్చుకున్నారు. వెంకటరెడ్డికి తోడుగా రాజగోపాల్ రెడ్డి జత కలవడంతో నల్లగొండ జిల్లా రాజకీయాల్లో  వీళ్ల హవా కొనసాగుతూ వస్తుంది. ఇలా ఈ ఇద్దరు సోదరులు నల్లగొండ జిల్లాలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి  వ్యూహాలు రచిస్తూ వచ్చారు.


ఇంత వరకు బాగానే ఉన్నా బీఆర్ఎస్ తో ఈ పొలిటికల్ బ్రదర్స్ కు పెద్ద కష్టమే వచ్చి పడింది. 2014, 2019 వరుస విజయాలతో బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించింది. మునుగోడు మినహా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంది.  మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీఆర్ఎస్ రాజీకీయంగా ఇబ్బందులకు గురి చేసింది. దీంతో ఏం చేయాల తోచని స్థితిలో రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక రావడం అక్కడ కూడా బీఆర్ఎస్ గెలవడం చకచకా జరిగిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరితే ఐనా రాజకీయంగా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చనుకున్న రాజగోపాల్ రెడ్డి ఆశ నెరవేరలేదు. మునుగోడు లో ఓటమి తర్వాత కూల్ అయ్యారు. ఇదే సమయంలో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమైంది. 


వరుసగా రెండు సార్లు గెలుపొందిని బీఆర్ఎస్ పై జనాల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ కు కాస్తా సానుకూల వాతవారణం ఏర్పడింది. దీంతో రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ తరుపున మునుగోడు బరిలో నిలబడి భారీ విజయం సాధించారు. అంతే కాదు జిల్లాలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనపడింది. సూర్యపేట మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అలర్ట్ అయ్యారు. జిల్లా రాజకీయాలు తమ చెప్పుచేతుల్లో ఉండాలనే ఉద్దేశంతో పావులు కదపడం మొదలు పెట్టారు. గతంలో నల్లగొండ జిల్లా రాజకీయాల్లో జానారెడ్డి పెద్ద దిక్కుగా ఉండేవారు. కానీ ఆయన వయస్సు రిత్యా రాజకీయాల నుంచి సైడ్ కావడంతో జిల్లా రాజకీయాల్లో పట్టు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నించారు. 


కానీ ఈ బ్రదర్స్ కు జిల్లాకు చెందిన మరో కుటుంబంతో పోటీ ఏర్పడింది. అప్పటికే కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండి, అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా మెదులుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తో రాజీకయ వైరి మొదలైంది. ఒకటే పార్టీ ఐనా జిల్లా రాజకీయాల్లో పట్టుకోసం ఈ రెండు కుటుంబాలు రాజకీయాలు షురూ చేశాయి.మరీ ముఖ్యంగా పదవుల విషయంలో ఈ రెండు కుటుంబాలు ఎక్కడా కూడా తగ్గేది లేదు అన్నట్లుగా వీరి తీరు ఉండేది. మొన్నటి ఎన్నికల్లో ఉత్తమ్ దంపతులు గెలవగా, అదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా గెలుపొందారు. దీంతో ఇప్పుడు మరోసారి వీరి మధ్య పదవుల పేచీ పడిందని జిల్లాలో టాక్.


సీనియర్లు ఐనా ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మంత్రి పదవులు రాగా,  ఉత్తమ్ పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు మాత్రం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరు సమయంలోనే రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందనేది ఆయన అనచరుల మాట. దీంతో తనకు ఎలాగైనా మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్ రెడ్డి కోటి ఆశలు పెట్టకున్నారు. అంతే కాదు చాలా సందర్భాల్లో పలు వేదికల మీద బహిరంగంగానే నాకు మంత్రి పదవి వస్తుంది. నాకు హోంమంత్రిగా చేయాలని  ఆశ ఉంది అని తన కోరికను వెలిబుచ్చారు. ఐతే కొన్ని కారణాలతో కోమటిరెడ్డికి మంత్రి పదవి దక్క లేదు.  ఈ లోపే పార్లమెంట్ ఎన్నికలు రావడం అందులో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి భుజాల మీద పెట్టడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంచి పదవి దక్కుతుందని భరోసా ఇచ్చారు.


దీంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి ఎనలేని ఉత్సాహంతో కిరణ్‌ కుమార్ రెడ్డిని భారీ  మెజార్టీతో గెలిపించారు. అయితే ఇప్పుడు మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు షురూ చేశారు. మంత్రి పదవిపై రేవంత్ రెడ్డి నుంచి కూడా భరోసా వచ్చింది కానీ అధిష్టానం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదనే చర్చ గాంధీ భవన్ లో జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతుంది ఉత్తమ్ ఫ్యామిలీ అని జిల్లాలో చర్చ. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్య పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ పెద్దల ముందు ఉత్తమ్ డిమాండ్ పెడుతున్నట్లు తెలిసింది. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం పెద్ద సమస్యగా మారింది. 



మంత్రి పదవి కావాలనే పట్టుదలతో ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఉత్తమ్ ఫ్యామిలీ రూపంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో రాజగోపాల్ రెడ్డి రూటు మార్చారు. ఇన్ని రోజులు జిల్లాలో, పార్టీలో తమ పోటీ అనుకున్న వారి దగ్గరనే రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గేలా చేసింది. ఎవరిపైనా ఐతే ఆధిపత్యం చెలాయించాలనుకున్నారో వారినే తప్పని పరిస్థితిలో పొగడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఒక రోజు తప్పకుండా సీఎం అవుతారని రాజగోపాల్ రెడ్డి నోట రావడం సంచలనంగా మారింది. అంతే కాదు తాను చెప్పేది ఖచ్చితంగా జరిగి తీరుతుందని నా నాలుక మీద నల్లమచ్చలు ఉన్నాయని చెప్పడం రాజకీయంగా ఆసక్తిగా మారింది.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


 అసలు రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆకాశానికి ఎత్తడం వెనుక కారణమేంటని జిల్లాల్లో చర్చ జరుగుతుంది. ఇక్కడే ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. తన మంత్రి పదవికి ఉత్తమ్ అడ్డుపడుతున్నారనేది రాజగోపాల్ రెడ్డి భావన. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికే ఉత్తమ్ సీఎం అంటూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడారని జిల్లాలో టాక్. తనకు మంత్రి పదవి దక్కాలంటే ఉత్తమ్ మద్దతు అవసరం కాబట్టి ఉత్తమ్ ను లైన్లో పెట్టుకోవడానికే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి.


మొత్తానికి మంత్రి పదవి కోసం ఎంత వరకైనా తగ్గడానికైనా రాజగోపాల్ రెడ్డి సిద్దపడుతున్నట్లు తెలుస్తుంది. మంత్రి పదవి కావాలన్న ఆశ రాజగోపాల్ రెడ్డి తన ఇగోను సైతం పక్కకు పెడుతున్నట్లు తెలుస్తుంది. మరి ఇంతలా కాంప్రమైజ్ అవుతున్న రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరిస్తుందా లేదా అనేది మాత్రం అధిష్టానం చేతిలో మాత్రమే ఉంది.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.