తూర్పు లఢాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు(Colonel Santosh Babu) అస్థికలను కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద త్రివేణి సంగమంలో అమరవీరుడు సంతోష్ బాబు అస్థికల్ని(Martyr Santosh Babu Ashes) కలిపారు. త్రివేణి సంగమం వద్దకు సంతోష్ బాబు కుటుంసభ్యులు, ప్రజా ప్రతినిధులు ఓ బోటులో వెళ్లారు. తన కొడుకు దేశానికి చేసిన సేవల్ని, కొడుకు జ్ఞాపకాలను తల్లిదండ్రులు గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యుల వెంట స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీకి భారీ సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"186755","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]


అమరవీరుడు సంతోష్ బాబు(Santosh Babu) అస్థికల్ని త్రివేణి సంగమంలో కలుపుతున్నారని తెలిసి స్థానిక ప్రజలు మరోసారి సంతోష్ బాబు అమర్ రహే, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. జాతీయ పతాకంతో రోడ్ల మీదకు వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపారు. కాగా, కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల సహాయంతో పాటు ఇంటి స్థలం, ఆయన భార్యకు గ్రూప్1 స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సైనిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు.. వీరుడికి వీడ్కోలు