హైదరాబాద్: తూర్పు లఢాఖ్లోని గాల్వన్ లోయ(Galwan Valley)లో చైనాతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు (Colonel Santosh Babu) కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు సాయాన్ని సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ప్రకటించారు. అమరుడైన సంతోష్ బాబు కుటుంబానికి నివాస స్థలంతో పాటు ఆయన భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సైనిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు.. వీరుడికి వీడ్కోలు
సంతోష్ బాబు (Santosh Babu) కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నేరుగా తానే కల్నల్ ఇంటికి వెళ్లి సాయాన్ని అందించనున్నట్లు KCR స్పష్టం చేశారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన మరో 19 మంది భారత సైనికులకు సైతం సీఎం కేసీఆర్ సాయాన్ని ప్రకటించారు. ఆ 19 అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల నగదు చొప్పున తెలంగాణ సర్కార్ సాయం చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం చూసి కుప్పకూలిన తల్లి, భార్య
సరిహద్దుల్లో దేశ రక్షణ విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలన్నారు. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకుంటేనే తద్వారా వారి కుటుంబాల్లో భరోసా వస్తుంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమకు తోచిన సాయం చేయాలని పిలుపునిచ్చారు. సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలని, కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఖర్చులు తగ్గించుకుని సైనికుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. ప్రధాని నరేంద్ర నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ