Nagababu : నాగబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత
నాగబాబుపై ( Nagababu Konidela ) టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ బుధవారం ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన స్వాతంత్ర సమరయోధుడు, మన జాతిపిత మహాత్మా గాంధీని (Mahatma Gandhi`s assassination) హతమార్చిన నాథురామ్ గాడ్సెను ( Nathuram Godse ) ప్రశంసించి.. మహాత్మా గాంధీని సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు అవమానించారని మానవతారాయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్ : నాగబాబుపై ( Nagababu Konidela ) టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ బుధవారం ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేశానికి స్వాతంత్య్రం సంపాదించిపెట్టిన స్వాతంత్య్ర సమరయోధుడు, మన జాతిపిత మహాత్మా గాంధీని (Mahatma Gandhi`s assassination) హతమార్చిన నాథురామ్ గాడ్సెను ( Nathuram Godse ) ప్రశంసించి.. మహాత్మా గాంధీని సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు అవమానించారని మానవతారాయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగబాబుపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం మానవతారాయ్ మాట్లాడుతూ.. నాగబాబుకు మతిభ్రమించిందని, ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలని అన్నారు. మానసిక స్థితి బాగాలేకపోవడం వల్లే నాగబాబు ట్విటర్‌లో గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడని ప్రశంసించారని ఎద్దేవా చేశారు. అందుకే జాతిపితను అవమానించిన నాగబాబుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానవతారాయ్ పోలీసులను డిమాండ్ చేశారు. ( Also read : గాంధీ అంటే చాలా గౌరవం, ప్లీజ్ అర్థం చేసుకోండి: నాగబాబు )
[[{"fid":"185834","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
[[{"fid":"185835","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
నాగబాబును వివాదంలోకి నెట్టేసేని ట్వీట్ ( Nagababu`s controversial tweet ) విషయానికొస్తే.. మంగళవారం నాథూరాం గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా గాడ్సే గురించి ఓ ట్వీట్ చేసిన నాగబాబు.. '' ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్. అతని వాదన ఏంటనేది ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు అంతే). గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఓసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్'' అని అందులో పేర్కొన్నారు. సరిగ్గా నాగబాబు చేసిన ఈ ట్వీటే ఆయన్ని జాతిపిత అభిమానుల చేతిలో తీవ్ర విమర్శలపాలయ్యేలా చేసింది. (Also read : Atma nirbhar package : కేంద్రం ప్యాకేజీపై మంత్రి ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు )
గాడ్సె వివాదంపై స్పందించిన నాగబాబు.. తన ఉద్దేశం జాతిపితను కించపర్చడం కానేకాదని వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. ఆ ట్వీట్ రేపిన దుమారం మాత్రం ఇంకా సద్దుమణగలేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్