GHMC Elections 2020: ప్రతిష్టాత్మకంగా నువ్వా నేనా రీతిలో సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మాత్రం నిరాశపరుస్తోంది. పోలింగ్ భారీగా తగ్గిపోయింది. మరిప్పుడు తగ్గిన ఈ పోలింగ్ శాతం ఎవరికి ప్రయోజనం కల్గించనుంది..ఎవరికి నష్టం చేయనుంది. విశ్లేషణ మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వారం రోజులకు పైగా వాడివేడి ఆరోపణలతో..ప్రముఖ నేతలతో నువ్వా నేనా రీతిలో సాగిన జీహెచ్ఎంసీ (Ghmc elections ) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రచారం ఎంత రక్తి కట్టించిందో..పోలింగ్ అంతగా నిరాశ పర్చింది.


పోలింగ్ ( Polling ) ప్రారంభమైనప్పటి నుంచి మందకొడిగానే సాగింది. మద్యలో పార్టీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా..మీడియా ఎంతగా ప్రచారం చేసినా గ్రేటర్ ఓటర్ ( Greater Voter ) పోలింగ్ బూత్‌కు రానన్నాడు. గతంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఓటరులో ఇంతటి నిరాసక్తత కన్పించలేదు. గ్రేటర్ పోలింగ్ 40-41 శాతం మధ్య ఉంటుందనే అంచనా ఉంది. అంతకంటే తక్కువున్నా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. Also read: Ap Assembly live: స్పీకర్‌ను బెదిరించిన చంద్రబాబు..సభలో దుమారం


టీఆర్ఎస్ ( TRS ), ఎంఐఎం ( MIM ), బీజేపీ ( BJP ), కాంగ్రెస్ ( Congress ) పార్టీల మధ్య పోటీ జరిగినా...ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్య సాగింది. బీజేపీ తరపున కేంద్రమంత్రులు రంగంలో దిగారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ( Up cm yogi Adityanath ), కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Central minister Home minister ) ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎంల మధ్య వాడివేడి ఆరోపణలు విన్పించాయి. 76 లక్షల పైచిలుకు ఓటర్లు 150 డివిజన్ల కోసం నిలబడిన 1122 మంది అభ్యర్దుల భవితవ్యానికి తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే 76 లక్షల పై చిలుకు ఓటర్లలో కేవలం 40 శాతం మంది మాత్రమే పోలింగ్ బూత్‌కు వచ్చారు.


దీనర్ధం ఏంటి..ఓటర్లలో అంతటి నిరాసక్తతకు కారణమేంటి..భారీగా తగ్గిన పోలింగ్ శాతం ఎవరకి లాభం..ఎవరికి నష్టం. ఈ వాస్తవాన్ని పరిశీలిద్దామిప్పుడు. వాస్తవానికి పోలింగ్ శాతం 70-80 శాతం దాటితే అధికారపార్టీకు నష్టంగా మారుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత ( Anti incumbancy )తో ఓటరు కసిగా వ్యవహరించి ఓటేస్తాడనేది ఓ విశ్లేషణ. అదే పోలింగ్ శాతం 50-70 మధ్యలో ఉంటే అధికారపార్టీకు లాభమని తెలుస్తుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అంతగా లేదు కాబట్టి..ఓటింగ్ పట్ల ఆసక్తి చూపించలేదనే వాదన ఉంటుంది. Also read: AP: జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలా...సుప్రీంకోర్టు ఇలా చెప్పిందా


కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో( Greater Hyderabad Elections ) అందుకు భిన్నంగా 40 శాతానికి పడిపోయింది. 2016లో జరిగిన పోలింగ్ కంటే 6 శాతం తక్కువే. మరి ఈ పోలింగ్ ఎవరికి లాభమనేదానిపైనే అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. 


ఒక్కసారి గ్రేటర్ పరిధిలో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే..కాలనీల్లో కంటే బస్తీల్లోనే ఎక్కువ పోలింగ్ నమోదైంది. అంటే విద్యాధికులు లేదా వ్యాపారులుండే ప్రాంతాల్లో కంటే సామాన్య జనం ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువ పోలింగ్ జరిగింది. బీజేపీకు ఉద్యోగస్థులు, నగరవాసుల్లో ఎక్కువ పట్టు, ఆదరణ ఉందనేది ఆ పార్టీనే స్వయంగా చెబుతున్న మాట. కాలనీల్లో పోలింగ్ శాతం తగ్గడానికి కారణం వరుస మూడ్రోజుల సెలవులతో ఉద్యోగులంతా సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అటు కార్తీక పౌర్ణమి ( Karthika pournami ) ప్రభావం కూడా పడింది. మరోవైపు కోవిడ్ ( Covid ) కారణంగా చాలామంది ఇప్పటికే వర్క్ ఫ్రం హోం ( Work From Home ) లో ఉన్నారు. వీరంతా ఓటు కోసం హైదరాబాద్ రావడానికి ఇష్టం చూపించలేదు.


ఈ కారణాల్ని విశ్లేషించుకుని తగ్గిన పోలింగ్ శాతం తమకే ప్లస్ అని టీఆర్ఎస్ భావిస్తోంది. అటు బస్తీల్లో తమకు పట్టు పెరిగిందని..దీనికి ఉదాహరణ దుబ్బాక ( Dubbaka ) విజయమని అంటోంది బీజేపీ. మరి వాస్తవం ఏంటి..ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్నగా మారి..విశ్లేషకుల్ని తొలిచేస్తుంది. Also read: GHMC Elections 2020: గ్రేటర్ ఓటర్ ఎక్కడ ? మందకొడిగా సాగుతున్న పోలింగ్, కారణాలేంటి