ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల సర్పంచ్ అభ్యర్ధుల అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తొలి విడుత పోలింగ్ ప్రశాంతగా కొనసాగినప్పటికీ రెండో విడతలో అక్కడక్కడ ఘర్షణలు చోటు  చేసుకోవడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనగామ మండలం రఘునాథ్ పల్లి పంచాయితీ ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  పోలింగ్ కేంద్రాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ప్రచారం నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ కు పోలీసులు సహకరిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు . ఈ క్రమంలో ఆ మార్గంగుండా వెళ్తున్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 


పరకాల మండలం నాగారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. సర్పంచ్ అభ్యర్ధులకు సంబంధించిన అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.


మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కోంపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ - టీఆర్ఎస్ వర్గీయుల మధ్య  ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టడం పరిస్థితి అదుపలోకి వచ్చింది


తాజా ఘర్షణలపై పోలీసులు స్పందిస్తూ అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఓటర్లు భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.