KTR:కాలుకు గాయమైందని కేటీఆర్ డ్రామా చేస్తున్నారా? అసలు కారణం ఇదేనా?
KTR: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎడమ కాలుకు గాయమైంది. ప్రగతి భవన్ లో ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో ఆయన కాలు చీలమండ ఫ్రాక్చర్ అయింది. కేటీఆర్ కాలు గాయంపై కాంగ్రెస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
KTR: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎడమ కాలుకు గాయమైంది. ప్రగతి భవన్ లో ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో ఆయన కాలు చీలమండ ఫ్రాక్చర్ అయింది. ‘నా యాంకిల్‌కి ఫ్రాక్చర్ అయింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో చూసేందుకు మంచి ఓటీటీ షోలు గురించి సలహా ఇవ్వండి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడంతో ఆయనకు గాయమైందని అందరికి తెలిసింది. రెస్ట్ తీసుకోవాలంటూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. ఓటీటీ షోల గురించి సమాచారం ఇచ్చారు. వివిధ రంగాల ప్రముఖులు కూడా కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు. కాలికి గాయం కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు కేటీఆర్.
అయితే కేటీఆర్ కాలు గాయంపై కాంగ్రెస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమలం అవుతున్నాయి. ఈసారి నగరాలు, పట్టణాల్లోనే వరద బీభత్సం ఎక్కువగా కనిపిస్తోంది.భైంసా, మంథని, నిజామాబాద్, జగిత్యాలలో గతంలో ఎప్పుడు లేనంతగా ముంపు కనిపించింది. హైదరాబాద్, వరంగల్ లోనూ దారుణ పరిస్థితులు కనిపించాయి. కేటీఆర్ ఐటీ శాఖతో పాటు మున్సిపల్ శాఖ కూడా చూస్తున్నారు. దీంతో వరదలతో చాలా పట్టణాలు నీట మునిగాయని, ప్రభుత్వ అసమర్దతతో వందలాది కాలనీలు జలమయం అయ్యాయని మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరద ప్రాంతాలను పరిశీలించకుండా తప్పించుకోవడానికే కాలుకు గాయమైందంటూ కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.
మున్సిపల్ శాఖ మంత్రి వరద ప్రాంతాలకు వెళితే అక్కడి ప్రజలు నిలదీస్తారనే భయంతో కేటీఆర్ కాలుకి గాయం సాకు చూపుతూ ప్రగతి భవన్ లో రెస్ట్ తీసుకుంటున్నారంటూ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రెండేళ్ల క్రితం వరంగల్ లో వరదలు బీభత్సం స్పష్టించాయి. ఆ సమయంలో వరంగల్ లో పర్యటించిన కేటీఆర్ వరద ముందు నివారణకు పలు హామీలు ఇచ్చారు. కాని అవి అమలు కాలేదు. ఈసారి కూడా పలు కాలనీలు నీటమునిగాయి. తాను జనంలోకి వెళితే గత హామీలపై నిలదీస్తారనే భయంతోనే కేటీఆర్ వరద ప్రాంతాలకు రావడం లేదని కొండా సురేఖ ఆరోపించారు. హైదరాబాద్ లోనూ వరద నివారణ చర్యలు చేపట్టడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. అందుకే వరద ప్రాంతాల పరిశీలనను తప్పించుకోవడానికే కాలుకి గాయం అయిందంటూ కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆర్ కాలుకి గాయంపై సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా మారాయి.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం... హయత్‌నగర్‌లో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం..
Also Read: Horoscope Today July 26th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ్టితో ఈ రాశి వారికి కష్టాలన్నీ తొలగిపోతాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.