Komatireddy Rajgopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన పార్టీ మారుతారని దాదాపు ఏడాదిన్నరగా ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని.. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని కామెంట్ చేస్తూ వస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే ఏడాదిన్నరగా అది జరగలేదు. తాజాగా ఢిల్లీలో కేంద్ర  హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు రాజగోపాల్ రెడ్డి. దీంతో ఈసారి ఆయన బీజేపీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. కోమటిరెడ్డిని పార్టీలో చేర్చుకుని... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నిక తీసుకురావాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారనే టాక్ వస్తోంది. మునుగోడుకు ఉప ఎన్నిక ఖాయమని అంతా భావిస్తుండగా.. కోమటిరెడ్డి మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. ఢిల్లీలో అమిత్ షాను కలిసిందని నిజమేనని చెబుతూనే.. పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై స్పష్టం ఇవ్వడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సోమవారం సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై ఆయనతో చర్చించారు. భట్టీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ ను మరింత ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో ఉండటం అసాధ్యమని తేలిపోయింది. మంగళవారం మునుగోడు నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపారు కోమటిరెడ్డి. పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశాలపై తన అనుచరుల అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే బీజేపీలో చేరడం ఖాయమైనా చేరికకు మాత్రం ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.


బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పై ఆరోపణలు చేసి ఆ పార్టీ నుంచి సస్పెండ్ కావాలన్నది రాజగోపాల్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కాకుండా బీజేపీలో చేరితే.. ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డిపై ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పీకర్ వేటు వేయవచ్చు. అయితే మునుగోడుకు ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటున్న రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పై అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేస్తారని ఆయన లెక్క. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశాకా బీజేపీలో చేరినా ఆయన ఎమ్మెల్యే పదవికి ఢోకా ఉండదు. ఈ దిశగానే రాజగోపాల్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేసే వరకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయరని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యూహం కనిపెట్టిన కాంగ్రెస్ కూడా ఆయన విషయంలో వేచిచూసే దోరణిలో ఉందంటున్నారు. మొత్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు, రాజీనామా అంశం మరికొన్ని రోజుల పాటు సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


Also Read: AP EAMCET Results 2022: మరికాసేపట్లో ఈఏపీసెట్ ఫలితాలు.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవాలి..  


Also Read: Raksha Bandhan 2022: సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్లే ఎందుకు వేయాలి? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి