AP EAMCET Results 2022: ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

AP Eapcet Results 2022: నేడు ఈఏపీసెట్ (EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 11 గంటలకు విజయవాడలో ఫలితాలు విడుదల చేశారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 26, 2022, 12:19 PM IST
  • ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
  • విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
  • విద్యార్థులు ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి
AP EAMCET Results 2022: ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

AP EAPCET Results 2022 Released: నేడు ఈఏపీసెట్ (EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 11 గంటలకు విజయవాడలో ఫలితాలు విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షకు ఈ ఏడాది 3.84 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.  తాజా ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో 89.12 శాతం మంది విద్యార్థులు, అగ్రికల్చర్ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈఏపీసెట్ ఫలితాలను విద్యార్థులు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

విద్యార్థులు ఇలా చెక్ చేసుకోవచ్చు :

మొదట https://cets.apsche.ap.gov.in/EAPCET వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోం పేజీలో ఈఏపీసెట్ 2022 రిజల్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
హాల్ టికెట్ నంబర్ అని ఉన్న బాక్స్‌లో నంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ ఆప్షన్ నొక్కాలి.
అంతే.. స్క్రీన్‌పై మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.
మున్ముందు అవసరాల కోసం ఫలితాల కాపీని ప్రింటవుట్ తీసి ఉంచుకోండి.

కాగా, ఇదివరకు ఎంసెట్ (EAMCET) పేరిట నిర్వహించిన పరీక్షను ఇప్పుడు ఈఏపీసెట్‌ పేరిట నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గతేడాది ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మెడికల్ ప్రవేశాలు నీట్ పరీక్ష ద్వారానే జరుగుతున్నందునా.. EAMCETలో మెడికల్-M స్థానంలో ఫార్మసీ-P లెటర్‌ను చేర్చారు. ఈసారి ఈఏపీసెట్ ర్యాంకులకు ఇంటర్ వెయిటేజీని రద్దు చేశారు. పూర్తిగా ఈఏపీసెట్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించనున్నారు.

Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన 

Also Read: Encounter:మావోయిస్టు అగ్రనేత హతం.. ఛత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News