Ex MLA Jagga Reddy: వాడు దొరికితే ఖైరతాబాద్ చౌరస్తాలో బట్టలు ఊడదీసి కొట్టేవాడిని.. జగ్గారెడ్డి బూతుపురాణం
Jagga Reddy Fires On KTR: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బూతులతో రెచ్చిపోయారు. అధికారం పోయేసరికి ఇద్దరికి పిచ్చిపట్టిందన్నారు. అమెరికాలో ఉండి తమపై ట్రోల్స్ చేస్తున్నారని.. వాడు దొరికితే బట్టలు ఊడదీసి కొట్టేవాడినని అన్నారు.
Jagga Reddy Fires On KTR: బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండిపాలెం బ్యాచ్ అయిందన్నారు. కేటీఆర్, హరీష్ రావులకు పిచ్చిపట్టినట్లు ఉందని.. అధికారం పోయేసరికి మెంటల్ ఎక్కిందన్నారు. ఇంకా నాలుగు ఏండ్లు ఎప్పుడు ఐతుందా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రిని ఎప్పుడు బదనాం చేద్దామని చూస్తున్నారని మండిపడ్డారు. బెవకూఫ్ చేతలు చేయొద్దని చెప్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Ys Jagan Vs Sharmila: జగన్, షర్మిల ఆస్తుల పంచాయితీ.. మధ్యలోకి జూనియర్ ఎన్టీఆర్.. ఇదేందయ్యా..!
అమెరికాలో ఉండి కేటీఆర్ ఫొటోలు పెట్టి తమను ట్రోల్ చేస్తున్నారని.. వాడు దొరికితే ఖైరతాబాద్ చౌరస్తాలో బట్టలు ఊడదీసి కొట్టేవాడినని జగ్గారెడ్డి అన్నారు. "కేటీఆర్.. ఇది పద్ధతి కాదు.. చెబుతున్నా.. బీఆర్ఎస్ మెంటల్ నా కొడుకులు. మీరు రేవంత్‌తో.. నాతో కుస్తీ పట్టలేరు.. కొట్లాడ లేరు మీరు.. చెత్తనా కొడుకులారా.. కేటీఆర్..హరీష్ రావులకు కూడా ఈ తిట్లు. రాజకీయం ఎలా చేయాలో తెలియదా బే..
ఇష్యూ టేకప్ చెయ్.. అమెరికా.. దుబాయ్.. లండన్‌లో ఉండి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కొడుకులను ఎత్తుకు రమ్మని చెప్పండి.. ఫ్లైట్ కిరాయిలు ఐతే ఇద్దాం.. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, మంత్రులు ఎట్లా కనపడుతున్నారు కొడుకులరా.. కలెక్టర్‌ను నేను తిట్టినట్టు పోస్ట్ చేశాడు. గత ప్రభుత్వంలో ఒకరిద్దరు కలెక్టర్లు ఫోన్లు ఎత్తలేదు. పదిసార్లు చేసినా ఫోన్ ఎత్తలేదు.. తిట్టినా.. కానీ ఇప్పుడు ఉన్న మహిళా కలెక్టర్‌ను తిట్టినట్లు పోస్ట్ పెట్టినాడు. ఎవడు కొట్టకండీ వాడి ఫోటో బయట పెడుతున్నా.. వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని రండి.." అని జగ్గారెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పని మొదలుపెట్టి 10 నెలలే అయ్యిందని.. అప్పుడు బీఆర్ఎస్ నేతల తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఇంకా నాలుగేండ్లు భరించాలని.. మరో ఐదేళ్లు కూడా అధికారంలో ఉండేందుకు ప్లాన్ వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter