Congress MLC Candidates: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్‌, ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్‌ పేర్లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఎమ్మెల్సీ సీట్లకు పలువురి పేర్లు తెరపైకి వచ్చినా.. చివరకు వీరిద్దరి వైపు అధిష్టానం మొగ్గు చూపింది. మరోవైపు  గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా జావెద్ అలీ ఖాన్ కొడుకు అమిర్‌ అలీ ఖాన్, కోదండ రామ్‌  పేర్లు వినిపిస్తున్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 18వ తేదీ వరకు సమయం ఉంది. ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండడంతో రెండు సీట్లు కాంగ్రెస్‌ ఖాతాలోకే వెళ్లనున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వీరిద్దరి స్థానాలకు జనవరి 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం రెండు ఎమ్మెల్సీ సీట్లకు వేర్వేరుగా పోలింగ్ జరగనుంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు రెండు స్థానాల కోసం రెండు ఓట్ల వేయనున్నారు. దీంతో 65 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ కూటమికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. వేర్వేరుగా కాకుండా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఎన్నిక జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చెరో సీటు దక్కేవి. అయితే ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అదేవిధంగా త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
 
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇలా..


==> నోటిఫికేషన్‌ తేదీ: జనవరి 11
==> నామినేషన్ల స్వీకరణకు లాస్ట్ డేట్: జనవరి 18
==> నామినేషన్ల పరిశీలన: జనవరి 19
==> నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ: జనవరి 22
==> ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌: జనవరి 29


Also Read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..


Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter