TRS MLAS BRIBE: కాంగ్రెస్ నేతలతోనూ నందకుమార్ చర్చలు! బీజేపీలో చేరికపై మల్ రెడ్డి రంగారెడ్డి క్లారిటీ
TRS MLAS BRIBE: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసుల విచారణలో రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ కేసులో నందకుమార్ డొంక కదులుతోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న నందకుమార్ కు సంబంధించి కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి
TRS MLAS BRIBE: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసుల విచారణలో రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ కేసులో నందకుమార్ డొంక కదులుతోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న నందకుమార్ కు సంబంధించి కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో నందకుమార్ తో రాజకీయ లింకులు బయటికి వస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు గతంలో కాంగ్రెస్ నేతలతోనూ నందకుమార్ చర్చలు జరిపారని తెలుస్తోంది. నందకుమార్ కాంగ్రెస్ నేతలను కలిసిన ఫోటోలు బయటికి వస్తున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, మలక్ పేట మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో నందకుమార్ చర్చలు జరిపారు. వీళ్లిద్దరి సమావేశం ఈనెల 12,13, 14 తేదీలలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. మల్ రెడ్డిని బీజేపీలో చేర్చడానికి నందకుమార్ డీల్ చేశారని తెలుస్తోంది. ఈ సమావేశం వివరాలు రహస్యంగా ఉన్నా.. రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ ఘటనతో తెరపైకి వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మల్ రెడ్డిని బీజేపీ చేర్చేలా నందకుమార్ చర్చలు జరిపారని అంటున్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఎలాగు ఓడిపోతుంది కాబట్టి.. ఆ కారణం చూపి కొందరు సీనియర్ నేతలను బయటికి లాగడానికి ప్రయత్నాలు చేశారని అంటున్నారు. నందకుమార్ తో కుదిరిన డీల్ ప్రకారం మల్ రెడ్డితో పాటు మలక్ పెట్ చెందిన ఒక మాజీ కార్పొరేటర్ ఒకరు, మరొక కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీని వీడేలా స్కెచ్ వేశారని సమాచారం.
తాను పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారంపై మల్ రెడ్డి రంగారెడ్డి స్పందించారు. తనపై జరుగుతున్నదంతా అసత్య ప్రచారమన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు మల్ రెడ్డి. అధికారం కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదన్నారు. నందకుమార్ అనే వ్యక్తి తనకు ఎప్పటి నుంచో తెలుసన్నారు. తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అప్పుడప్పుడు తనను కలిసి ఫోటోలు దిగాడని తెలిపారు. తనను బీజేపీలోకి రమ్మనేంత సీన్ నందకు లేదన్నారు మల్ రెడ్డి రంగారెడ్డి. తాను బీజేపీలోకి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో కొందరు బేవకూఫ్ గాళ్లు పోస్టులు పెట్టారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటంలో తాము ముందు ఉంటానని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు మల్ రెడ్డి రంగారెడ్డి.
Read also : Ashu Reddy Hot Photos: మరోసారి స్కిన్ టైట్ డ్రెస్ లో రెచ్చిపోయిన అషు రెడ్డి.. కావాలని అవి చూపిస్తూ రచ్చ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి