ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతల పాలన కొనసాగిస్తున్నారని దేశంలో ఏ ప్రాజెక్టులో జరగని..  అవినీతి కేవలం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిందని..  కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.  బుధవారం ఈమెరకు షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన దోపిడీ సొమ్ము ప్రజలకిస్తామన్నారు. కంప్యూటరైజేషన్‌ పేరుతో ధరణిలో భారీగా దోపిడీ జరిగిందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా దోపిడీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ఏటీఎం అని ఓ పోస్టర్ చూపించారు. ఈ శతాబ్దంలో ఇదే అతిపెద్ద స్కాం అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2500 జమ చేస్తామన్నారు.


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2500తో పాటు 500కే సిలిండర్ వస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమని రాహుల్ గాంధీ మరోసారి పునరుద్ఘాటించారు. ఎక్కడికైనా వెళ్లేందుకు బస్సు చార్జీలకే రూ. 1000-1500 ఖర్చు అవుతుందని ఆ ఖర్చుల బాధలను తగ్గించేందుకు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనపై 24 కేసులు పెట్టాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వాళ్లు దేశాన్ని విభజించాలని చూస్తే.. నేను మాత్రం దేశాన్ని కలిపి ఉంచాలని చూస్తానని ప్రకటించారు. 


Also Read: MLA Thopudurthi Prakash Reddy: న్యాయం గెలిచిందా..? రోగం గెలిచిందా..? చంద్రబాబు బెయిల్‌పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు  


ధరణితో 25 లక్షల మంది రైతుల భూములను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సర్కార్ నాకు ఇచ్చిన ఇళ్లును కూడా నరేంద్ర మోదీ లాక్కున్నారని ఆయన అన్నారు. భారతదేశంలో కులగణన జరగాల్సిందేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓబీసీలకు అధికారాన్ని ఇవ్వడానికి బీజేపీ, బీఆర్ఎస్ లు నిరాకరిస్తున్నాయని.. అందుకే బీసీ కులగణనకు ఆ పార్టీలు ఒప్పుకోవడం లేదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేపడతామని ప్రకటించారు. అదేవిధంగా కేంద్రంలో అధికారం చేపట్టగానే హిందూస్థాన్ అంతా కుగణన చేస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. వీర్లపల్లి శంకర్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని రాహుల్ గాంధీ కోరారు. దేశంలో బిజెపి విద్వేషం రెచ్చగొడుతుండగా తాను మాత్రం ప్రేమను పంచుతున్నానని పదేపదే చెప్పారు.


Also Read: Pushpa 2:పుష్ప కొత్త షెడ్యూల్.. జాతర ఫైట్ తో మొదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..