Six Schemes: తెలంగాణకు ఆరు గ్యారంటీ పధకాలు ప్రకటించిన సోనియా గాంధీ
Six Schemes: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులూ ఒడ్డేందుకు ప్రయత్నిస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త 6 పథకాల్ని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Six Schemes: తెలంగాణ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ వరాల వర్షం కురిపిస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రధానంగా 6 పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నిర్ణయించింది. ఇవాళ జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు.
రానున్న తెలంగాణ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తుక్కుగూడలో జరిగిన విజయభేరిలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఆరు పధకాలు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమిచ్చిన పార్టీగా, వ్యక్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమపై ఉందన్నారు సోనియా గాందీ. అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని సోనియా గాంధీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు
మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెలా 2000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం కానుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా గ్యాస్ సిలెండర్ ధర 500 రూపాయలకే ఇవ్వనుంది.
చేయూత పథకంలో భాగంగా నెలకు 4000 రూపాయల పెన్షన్, 10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా అమలు చేయనున్నారు.
గృహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా అందించనుంది ప్రభుత్వం.
యువ వికాసంలో భాగంగా విద్యార్ధులకు 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు అందించనున్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణముంటుంది.
ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సహాయం అందించనున్నారు. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయించనున్నారు.
రైతు భరోసాలో భాగంగా రైతులు, కౌలు రైతులకు ఏటా 15000 రూపాయలు ఆర్ధిక సహాయం ఉంటుంది. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12000 ఆర్ధిక సహాయం అందుతుంది. వరి పంటకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ లభిస్తుంది.
Also read: CM KCR Fiery Speech: నన్ను చూస్తేనే లాగులు తడుస్తాయి.. కేసీఆర్ ఆవేశపూరిత ప్రసంగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook