హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ( వీహెచ్ ) తన రాజకీయ జీవితంపై కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని వ్యాఖ్యానించారు. అయితే తన తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తన సేవలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే ధ్యేయంగా పని చేస్తానని వీహెచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన చంచలగూడ జైల్లో ఉన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వీహెచ్ ఈ మేరకు ప్రకటన చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీహెచ్ కామెంట్ పై భిన్నాభిప్రాయాలు
కాంగ్రెస్ పార్టీ మూల స్థంభం, సీనియర్ నేత వి.హనమంతరావు ఇచ్చిన స్టేట్ మెంట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వయసు సహకరించకపోవడంతో ఇక రాజకీయలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో వీహెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు అభిప్రాయపడుతుంటే..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోనని మాత్రమే వీహెచ్ అన్నారని ..అంతే కానీ ఇది పొలిటికల్ రిటైర్మెంట్ గా భావించరాదని మరికొందరు పేర్కొంటున్నారు..


అధిష్టానంపై వీహెచ్ అలక ?
ఎన్నిక్లల్లో తనకు ప్రచార సాధరి బాధ్యతలు ఇవ్వకపోవడంతో పార్టీ అధిష్టానంపై అలిగిన వీహెచ్ ఈ మేరకు ప్రకటన చేశారనే కామెంట్స్ మరోవైపు నుంచి వినిపిస్తున్నాయి. రాజకీయాల నుంచి దూరంగా ఉండే ఆలోచన వీహెచ్ కు లేదని..అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వలేదన్న కారణంలో ఉద్వేగానికి లోనైన ఆయన ఇలాంటి ప్రకటన చేశారని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తాజా ప్రకటనకు గల కారణాన్ని వీహెచ్ వివరించకపోవడం  గమనార్హం.