Warangal: లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ సీటు హాట్‌హాట్‌గా ఉండగా.. పార్టీ మారి ఎంపీ టికెట్‌ పొందిన కడియం కావ్యకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సహకరించడం లేదు. నాయకత్వం సర్దుకుపోయినా పార్టీ కేడర్‌ మాత్రం సహించడం లేదు. క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ శ్రేణులు కావ్యకు మద్దతుగా పని చేయడం లేదు. అసంతృప్తితో ఉన్న వారు వరంగల్‌లో కడియం కావ్య ముందే కొట్టుకున్నారు. దీనికి మంత్రి కొండా సురేఖనే సాక్షిగా మారగా.. ఆమె కార్యాలయం భయానక వాతావరణం ఏర్పడింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Fake Video: 'ఇప్పుడు రాలేను.. 4 వారాల టైం కావాలి' ఢిల్లీ పోలీసులకు రేవంత్‌


 


లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వరంగల్‌లోని మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సమయంలో కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు, పాత కార్యకర్తల మధ్య వివాదం రాజుకుంది.

Also Read: Narendra Modi: 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో దేశం గర్విస్తే.. 'ఆర్‌' ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ


 


కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ కార్యకర్తలు వాపోయారు. ఇదే విషయమై సమావేశంలో ప్రస్తావించడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఆ వివాదం కాస్తా తీవ్రమై పరస్పరం కొట్టుకునే స్థాయికి చేరింది. దీంతో మంత్రి కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అభ్యర్థి కడియం కావ్య ముందే నాయకులు, కార్యకర్తలు కొట్టుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో కార్యాలయం నుంచి అర్ధాంతరంగా కడియం కావ్య వెళ్లిపోయింది.


మొదటి నుంచి కడియం కావ్య చేరికను కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆహ్వానించడం లేదు. ఆమె చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనూ కావ్యకు సహకరించడం లేదు. కడియం శ్రీహరి, కావ్యలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. వారిద్దరి వలన పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని పార్టీ కింది స్థాయి నాయకులు చెబుతున్నారు. అయినా కూడా పార్టీ అధిష్టానం వినిపించుకోకపోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో కడియం కావ్యకు మద్దతుగా పని చేయడం లేదు. క్షేత్రస్థాయిలో కావ్యకు మద్దతుగా ప్రచారం చేయకుండా సైలెంట్‌ అయిపోయారు. ఈ పరిణామం లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter