Narendra Modi: 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో దేశం గర్విస్తే.. 'ఆర్‌' ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ

Narendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 30, 2024, 06:35 PM IST
Narendra Modi: 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో దేశం గర్విస్తే.. 'ఆర్‌' ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ

Narendra Modi: కాంగ్రెస్‌ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో.. పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి చేస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పంచ సూత్రాలతో పాలన చేస్తోంది. అవేమిటంటే అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు' అని మోదీ అభివర్ణించారు. దేశంలో మళ్లీ పాత రోజులు తీసుకురావాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని విమర్శించారు.

Also Read: Asaduddin Owaisi: మాధవీలత గెలిస్తే హైదరాబాద్‌ సర్వనాశనం

 

'ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈరోజు తెలంగాణలో డబుల్‌ 'ఆర్‌' ట్యాక్స్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు దొడ్డిదారిలో ఆర్‌ ట్యాక్స్‌ కడుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వల్ల ప్రపంచమంతా గర్వపడుతుంటే.. డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌తో దేశం సిగ్గుపడుతోంది' అంటూ తెలంగాణలో రేవంత్‌ పాలనపై మోదీ విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Also Read: Gutha Amith Reddy: బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్‌

 

రుణమాఫీపై నిలదీత
ఎన్నికల హామీలో కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. 'రైతులను దేవుడిస్వరూపులుగా మేం చూస్తాం. తెలంగాణలో వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్‌ పార్టీ రైతులను మోసం చేసింది. వరికి కింట్వాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి హామీ నెరవేర్చలేదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పండుగులు చేసుకోవాలంటే కూడా ఎన్నో ఇబ్బందులు అని మోదీ తెలిపారు. ఇటీవల శ్రీరామనవమి, ఇతర పండుగల విషయంలో తెలంగాణలో జరిగిన సంఘటనలను గుర్తుచేశారు.

ఎస్సీ వర్గీకరణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన హామీని ప్రధాని మోదీ మరోసారి గుర్తుచేశారు. 'ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలం. కచ్చితంగా వర్గీకరణ చేస్తాం' అని ప్రకటించారు. రిజర్వేషన్లపై అమిత్‌ షా ఫేక్‌ వీడియోపై ప్రధాని మోదీ స్పందించారు. 'ఉమ్మడి ఏపీలో 2004లో రికార్డు స్థాయిలో కాంగ్రెస్‌ ఎంపీలను గెలిపించారు. కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను ఆ పార్టీ ఎలా కాలరాసిందో కళ్లారా చూశారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయత్‌, మరాఠాలకు కాంగ్రెస్‌ న్యాయం చేయలేదు. 26 బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకుండా రాత్రికి రాత్రి ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చింది' అని గుర్తుచేశారు.

రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావు లేదు మోదీ స్పష్టం చేశారు. రాజ్యాంగం అంటే పవిత్ర గ్రంథంగా భావిస్తామని చెప్పారు. తొలి ప్రధానమంత్రి నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తే.. ఇందిరాగాంధీ తూట్లు పొడిచారు' అని తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో బీబీ పాటిల్‌, మెదక్‌లో రఘునందన్‌ రావును గెలిపించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News