Temple To Revanth Reddy: తాము అభిమానించుకునే వారికి ఆలయాలు కట్టడం సహజమే. కానీ అధికారంలోకి పట్టుమని వంద రోజులు కూడా కాలేదు అప్పుడే సీఎంగా ఎన్నికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి గుడి కట్టిస్తారంట. కనిపించని దేవుడు కన్నా ప్రజలకు మేలు చేస్తున్న రేవంత్‌ రెడ్డిని దేవుడిగా కొందరు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పాలాభిషేకాలు చేసిన వారు ఇప్పుడు గుడి కట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ గుడి భూమిపూజకు రావాలని కొందరు పిలుపునిచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MP Candidates: బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటన.. ఇద్దరు సిట్టింగ్‌లకు, మరో ఇద్దరు మాజీలకు చాన్స్‌


అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్‌ రెడ్డి పాలనను నచ్చిన నల్లగొండ జిల్లా వారి మేడి సంతోష్‌ అతడికి గుడి కట్టాలని నిర్ణయించాడు. మొదటి నుంచి రేవంత్‌కు అభిమాన సంఘంగా ఉన్న సంతోష్‌ ఇప్పుడు సీఎంగా ఎన్నికైన తర్వాత మరింత అభిమానం పెంచుకున్నాడు. గతంలో చాలాసార్లు రేవంత్‌ రెడ్డిని స్వయంగా కలిశాడు. రేవంత్‌తో దిగిన ఫొటోలను భద్రపరుచుకున్నాడు. తాను అభిమానించే నాయకుడికి గుడి కట్టాలని సంతోష్‌ నిర్ణయించుకున్నాడు.

Also Read: KA Paul: బాబు మోహన్‌ సంచలనం.. మూడు పార్టీలు వదిలేసి ఆఖరికి కేఏ పాల్‌ పార్టీలో చేరిక


స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలలో గుడి కట్టేందుకు సిద్ధమయ్యాడు. భూమిపూజతో ఆలయ నిర్మాణ పనులు చేస్తానని సంతోష్‌ చెప్పాడు. స్వగ్రామంలో ఈనెల 19వ తేదీన జరుగనున్న భూమిపూజకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, వంశీచంద్‌ రెడ్డి హాజరవుతారని సంతోష్‌ వివరించాడు. సంక్షేమ పథకాలతో దేవుడిగా నిలిచాడని సంతోష్‌ పేర్కొంటున్నాడు. రేవంత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు అతడు గుడి నిర్మిస్తున్నట్లు గ్రామస్తలు చెబుతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుతున్న సంతోష్‌ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి మద్దతుగా పని చేశాడు. అంతేకాకుండా సంతోష్‌ రాష్ట్ర రెడ్డి అభిమానం సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. కాగా గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు కూడా పలుచోట్ల ఆలయాలు కట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ఎదుట కొందరు కేసీఆర్‌ అభిమానులు ఆలయం నిర్మించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook