KA Paul: బాబు మోహన్‌ సంచలనం.. మూడు పార్టీలు వదిలేసి ఆఖరికి కేఏ పాల్‌ పార్టీలో చేరిక

Babu Mohan Joins In Prajashanthi Party: మూడు పార్టీలు తిరిగిన బాబు మోహన్‌ చివరకు కేఏ పాల్‌ ప్రజాశాంతి పార్టీలో చేరారు. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తూ....

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 4, 2024, 04:29 PM IST
KA Paul: బాబు మోహన్‌ సంచలనం.. మూడు పార్టీలు వదిలేసి ఆఖరికి కేఏ పాల్‌ పార్టీలో చేరిక

Babu Mohan: హాస్య నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన పార్టీలను వదిలేసి క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్‌ స్థాపించిన ప్రజాశాంతి పార్టీలోకి బాబు మోహన్‌ చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన అకస్మాత్తుగా ఆ పార్టీలో చేరడం గమనార్హం. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలోనే ఆ పార్టీలో చేరినట్లు ఆయన అనుచరులు తెలిపారు. ఆయన ఇప్పటివరకు మూడు పార్టీలు మారిన ఆయన తాజాగా నాలుగో పార్టీలో చేరారు.

Also Read: Kallu Bar: తాగుబోతులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. మందు బార్ల మాదిరి కొత్తగా 'కల్లు బార్లు'

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆందోల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాబు మోహన్‌ ఓటమి పాలయ్యారు. అనంతరం మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో అతడు కమలం పార్టీకి ఫిబ్రవరి 7వ తేదీన రాజీనామా చేశారు. అనంతరం కొన్ని రోజులు దూరంగా ఉన్న ఆయన సోమవారం ప్రజాశాంతి పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీని వీడాలని భావించారు. తన కుమారుడికి అసెంబ్లీ టికెట్‌ విషయమై పార్టీ ప్రతినిధులతో వివాదం ఏర్పడింది. అయితే ఎన్నికల వరకు ఓపికగా ఉన్న ఆయన అనంతరం ఆ పార్టీని వదిలేశారు.

Also Read: KCR Meeting: 12న గులాబీ గర్జన.. సార్వత్రిక సమరానికి మాజీ సీఎం కేసీఆర్‌ సై

వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం పోటీ చేయడం లక్ష్యంగా బాబు మోహన్‌ అడుగులు వేస్తున్నారు. వరంగల్‌ టికెట్‌ తనకు ఇవ్వరని భావించిన బాబు మోహన్‌ ఆ పార్టీని వీడి ప్రస్తుతం ప్రజాశాంతిలో చేరారు. ఆ సమయంలోనే 'నా జీవితంలో ఒక్కసారైనా వరంగల్‌ నుంచి కచ్చితంగా లోక్‌సభకు పోటీ చేస్తాను. వరంగల్‌ ఎంపీగా గెలుస్తా' అని ప్రకటించారు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరికతో వరంగల్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. టికెట్‌ ఖరారైన తర్వాతనే బాబు మోహన్‌ ఆ పార్టీలో చేరినట్లు సమాచారం.

వందల సినిమాల్లో నటించిన బాబు మోహన్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీలో మొదట చేరి మంత్రి స్థాయికి ఎదిగారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. గులాబీ పార్టీలో ప్రాధాన్యం లేదని భావించి బీజేపీలో చేరారు. ఆ పార్టీలో కూడా గుర్తింపు లేకపోవడంతో ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరారు. 1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నాటి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2004లో నాటి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీ ఆందోల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి 2018లో ఆందోల్‌ టికెట్‌ ఆశించగా నిరాశ ఎదురైంది. 2023లో ఆందోల్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News