నా భార్య ఓడిపోవడమే మంచిదైంది: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana Municipal Elections | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది. అయితే సంగారెడ్డిలో తాము ఓడిపోవడం ఓ వరకు మంచిదైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఓ రకంగా మంచిదేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం తమకు పెద్ద విషయమేమీ కాదని, తన భార్య నెగ్గి ఒకవేళ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ సొంతం చేసుకున్నా.. నిధుల లేమితో ప్రజలకు ఏమీ చేయలేకపోయేవాళ్లమని చెప్పారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీనే ఇచ్చిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువగా కనిపించిందని ఆరోపించారు.
Also Read: గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ శకటం
గాంధీ భవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. తాజా ఎన్నికల్లో ఓడినప్పటికీ కాంగ్రెస్ ఎప్పటికీ హీరోనే అన్నారు. తమ వద్ద డబ్బులు లేనందువల్లే ఓడిపోయామని, అంత మాత్రాన తమకు ప్రజాధరణ లేదని భావించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు కేవలం 5 లేక 10 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి చెందారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేదని, అయినా తెలంగాణ సీఎం కేసీఆర్ వైపు ప్రజలు ఎందుకు మొగ్గుచూపారో చర్చిస్తామని తెలిపారు.
Also Read: సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు అభినందనలు: హరీష్ రావు
ధన ప్రవాహంతో ఎన్నికల్లో నెగ్గవచ్చుననే కొత్త విధానానికి అధికార టీఆర్ఎస్ పార్టీ తెరతీసిందన్నారు. ఓటర్లను కేసీఆర్ మభ్యపెట్టారని, అందుకే కాంగ్రెస్ కంచుకోట సంగారెడ్డిలో కూడా టీఆర్ఎస్ విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు. మంత్రి హరీష్ రావు వ్యూహాలతోనే ఇక్కడ టీఆర్ఎస్ గెలిచిందని, ఉమ్మడి మెదక్ జిల్లాకు సింగూరు నీళ్లు తీసుకొచ్చే బాధ్యతను ప్రజలు ఆయనకు అప్పగించారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..