Revanth Reddy`s arrest: రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై పార్లమెంట్ స్పీకర్‌కు ఫిర్యాదు
రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం (Revanth Reddy`s arrest) పార్లమెంట్‌కు చేరింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతున్న కాంగ్రెస్ నేతలను తెలంగాణ సర్కార్ (Telangana govt) తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని.. అందులో భాగంగానే రాజకీయంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై పైచేయి సాధించడానికే ఆయన్ను అక్రమ అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు.
న్యూ ఢిల్లీ: రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం (Revanth Reddy`s arrest) పార్లమెంట్‌కు చేరింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతున్న కాంగ్రెస్ నేతలను తెలంగాణ సర్కార్ (Telangana govt) తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని.. అందులో భాగంగానే రాజకీయంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై పైచేయి సాధించడానికే ఆయన్ను అక్రమ అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం సైతం ప్రవేశపెట్టింది. ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ స్పీకర్‌కి ఓ లేఖ సైతం రాశారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. ఆయనకు బెయిల్ రాకుండా చేస్తోంది అని ఆ లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో అసలు ఏం జరిగిందో కనుక్కోవాల్సిందిగా కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్‌కు విజ్ఞప్తిచేశారు.
కాంగ్రెస్ ఎంపీల ఫిర్యాదుపై స్పందించిన పార్లమెంట్ స్పీకర్.. రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో సమాచారం తెప్పించుకుంటా అని సర్ది చెప్పి పంపించారని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..