GO Number 46: తెలంగాణలో మళ్లీ నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. గతంలో డీఎస్సీ, గ్రూప్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని ధర్నాకు దిగిన నిరుద్యోగులు తాజాగా జీఓ నంబర్‌ 46 రద్దు చేయాలంటూ అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చారు. రోడ్డుపై భారీగా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. వాహనాల రాకపోకలకు అడ్డంగి నిలిచి రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగులు రోదిస్తూ తమ దీనవాస్థ వివరిస్తూ ఆందోళన చేపట్టడం కలచివేసింది. రోడ్డుపైకి చేరని నిరుద్యోగులను పోలీసులు దారుణంగా పక్కకు నెట్టేస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ దిగ్బంధమైంది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Fire On Revanth: సీఎం కుర్చీలో రేవంత్‌ రెడ్డి అన్‌ఫిట్‌.. కండకావరంతో అసభ్య వ్యాఖ్యలు


 


ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి జీవో నంబర్‌ 46ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యి 8 నెలలు అవుతున్నా జీవో నంబర్‌ 46ను పట్టించుకోకపోవడంతో కానిస్టేబుల్‌ అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళనకు గురయిన అభ్యర్థులు బుధవారం అర్ధరాత్రి మెరుపు ధర్నాకు దిగారు. బాధితుల ఆందోళనతో దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతం దద్దరిల్లింది. అధికారంలోకి రాగానే జీవో 46 రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని అభ్యర్థులు వాపోతున్నారు.

Also Read: Sabitha Indra Reddy: రేవంత్‌ రెడ్డి అసభ్య పదజాలం.. కంటతడి పెట్టుకున్న సబితా రెడ్డి


 


జీవో 46 రద్దు చేయాలని దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజీవ్ చౌక్‌లో కానిస్టేబుల్ అభ్యర్థులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా కూర్చుని రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేలాది మంది అభ్యర్థుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీఓ నంబర్ 46ను సవరించి, జీవో నంబర్ 46 సీడీ 1, సీడీ 2 విధంగా ఫలితాలు విడుదల చేసి కానిస్టేబుల్ నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.


వేలాది సంఖ్యలో..
నిరుద్యోగుల మెరుపు ధర్నాతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. వేలాది సంఖ్యలో అభ్యర్థులు రావడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు ముచ్చెమటలు పట్టాయి. రాత్రిపూట భారీ వాహనాలు వెళ్తున్న సమయంలో అభ్యర్థులు ధర్నా చేపట్టడంతో పెద్ద ఎత్తున బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. వీరి ఆందోళనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


వారి డిమాండ్లు ఇవే..!
జీవో నంబర్‌ 46తో వేలాది మంది అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళనకారులు వాపోతున్నారు. ఈ జీఓ విషయమై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నట్లు.. అక్కడ సానుకూల నిర్ణయం వచ్చిందని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జీవో నంబర్‌ 46ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter