KT Rama Rao Sabitha: అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సబితమ్మకు క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం బయట పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్, భట్టి వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ అన్‌ఫిట్ అని, కండ కావరంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Sabitha Indra Reddy: రేవంత్ రెడ్డి అసభ్య పదజాలం.. కంటతడి పెట్టుకున్న సబితా రెడ్డి
అసెంబ్లీ ఆవరణలో రేవంత్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. 'మా మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారు. ఈ అవమానం కేవలం సబితక్కకు సునీతక్కకు జరిగింది కాదు. యావత్ తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయం' అని కేటీఆర్ మండిపడ్డారు.
Also Read: Chiranjeevi: రేవంత్ రెడ్డి బాధపై చిరంజీవి స్పందన.. గద్దర్ అవార్డులపై మెగాస్టార్ ప్లాన్ ఇదే!
ఆడబిడ్డల ఉసురు
'రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్‌ఫిట్. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తది. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్లు కారు.. రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి' అని కేటీఆర్ హితవు పలికారు.
బేషరతుగా క్షమాపణ చెప్పాలి
'ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని... బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం భట్టి విక్రమార్కకు ఎవరు ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా' అని ప్రశ్నించారు.
తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం
'ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడానని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం. అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం. ఈరోజు మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం. ముఖ్యమంత్రి సిగ్గు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకో. ఇకనైనా ముఖ్యమంత్రి సమయం ఎంతో వివరించకుంటే ఊరుకునేది లేదు' అని కేటీఆర్ హెచ్చరిక చేశారు. ఆడబిడ్డలను అడ్డగోలుగా మాట్లాడి రేవంత్ పారిపోయారని విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter