Mask Must in Telangana: తెలంగాణలో కరోనా కలవర పెడుతోంది. గతవారం రోజులుగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా నిబంధనలు పక్కగా అమలు అయ్యేలా చూడాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్(డీహెచ్‌) శ్రీనివాస్‌ కీలక ప్రకటన చేశారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని..లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా తప్పదన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. నిన్న తెలంగాణలో 485 కరోనా కేసులు బయట పడ్డాయి. 27 వేల 130 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..485 కేసులు నమోదు అయ్యాయి. ఇటు రికవరీ రేటు సైతం పెరుగుతోంది. తాజాగా కరోనా నుంచి కోలుకుని 236 మంది డిశ్చార్జ్ అయ్యారు.


రాష్ట్రంలో ప్రస్తుతం 4 వేల 421 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 8 లక్షలుగా ఉంది. 7 కోట్ల 91  లక్షల 944 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 4 వేల 111గా ఉంది. హైదరాబాద్‌లో 257, మల్కాజిగిరి పరిధిలో 37, సంగారెడ్డి జిల్లాలో 73, రంగారెడ్డి జిల్లాలో 58, ఖమ్మం జిల్లాలో 10 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈమేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.


Also read: India vs England: రేపటి నుంచి ఇంగ్లండ్, భారత్‌ ఏకైక టెస్ట్ మ్యాచ్‌..టీమిండియా కెప్టెన్‌ అతడే..!


Also read: Corona Updates in India: భారత్‌లో ఫోర్త్ వేవ్ రానుందా..ఇవాళ్టి కరోనా కేసులు ఎన్నంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook