India vs England: రేపటి నుంచి ఇంగ్లండ్‌లో టీమిండియా ఆట ప్రారంభంకానుంది. గతంలో కరోనా కారణంగా నిలిచిన పోయిన 5వ టెస్ట్‌ను మళ్లీ నిర్వహిస్తున్నారు. బర్మింగ్‌హామ్ వేదికగా మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానుంది. ఈమ్యాచ్‌లో భారత్‌ను నడిపించే సారధిపై ఆసక్తి నెలకొంది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడ్డారు. అతడు కోలుకుంటున్నాడు..టెస్ట్ మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదు.
తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లోనూ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఐసోలేషన్‌లో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కేఎల్ రాహుల్ సైతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడని..వైస్ కెప్టెన్‌గా ఉన్న బుమ్రాకు జట్టు పగ్గాలు చేపడతాడని తెలిపాయి. ఐతే దీనిపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రోహిత్ పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారని..మ్యాచ్‌కు అతడు దూరం కాలేదన్నాడు.
మరోవైపు రోహిత్ మ్యాచ్‌కు దూరమైతే ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు జట్టు బాధ్యతలు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక వేళ ఆ అవకాశం బుమ్రాకు తగ్గితే రికార్డే అవుతుంది. కపిల్ దేవ్ తర్వాత టెస్ట్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. దీనిపై రేపటితో క్లారిటీ రానుంది. ఇటు రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడు ఇంగ్లండ్ చేరుకున్నాడు. ఓపెనర్లుగా గిల్, మయాంక్ ఆడే అవకాశం ఉంది. అది జరగకపోతే గిల్, పూజారా మొదలు పట్టే ఛాన్స్ కనిపిస్తోంది.
Also read:శ్రీసత్య సాయి జిల్లాలో ఘోర విషాదం.. ఆటోపై తెగిపడ్డ హైటెన్షన్ వైర్.. 8 మంది సజీవదహనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.