COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్స్ ప్రకారం రాష్ట్రంలో రోజురోజుకు కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు అర్థమవుతోంది. బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం కొత్తగా  1,114 మందికి కరోనా సోకినట్టు తేలింది. అదే సమయంలో కరోనా కారణంగా మరో 12 మంది మృతి చెందారు. 


బుధవారం వరకు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య మొత్తం 6,16,688 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా 3,598 మంది చనిపోయారని వైద్య, ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి. కరోనావైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 5,96,628 మందికి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 16,462 కరోనా వైరస్ యాక్టివ్‌ కేసులు (COVID-19) ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.