Telangana high court: Schools reopening పై తెలంగాణ సర్కారుకు హై కోర్టు ప్రశ్నలు
Telangana high court comments on Schools reopening: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే జులై 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana high court) నేడు విచారణ జరిగింది. పాఠశాలల పునఃప్రారంభం విషయంలో హై కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం తరపున విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు.
Telangana high court comments on Schools reopening: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే జులై 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana high court) నేడు విచారణ జరిగింది. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని ప్రశ్నించిన హైకోర్టు.. పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుంది కదా అని సందేహం వ్యక్తంచేసింది. పాఠశాలల పునఃప్రారంభం విషయంలో హై కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం తరపున విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు.
ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు అందరూ కచ్చితంగా హాజరు కావాల్సిందిగా తప్పనిసరి నియమం లేదన్న సందీప్ కుమార్ సుల్తానియా.. ఇంటి వద్ద ఉండే తరగతులకు హాజరు కావాలి అనుకునే వారి కోసం ఆన్‌లైన్ బోధన (Online classes) కూడా కొనసాగుతాయని కోర్టుకు తెలిపారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల విషయంలో విద్యా సంస్థలు వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకునేలా మరో రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. హైకోర్టు సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా కోర్టుకు తెలిపారు.
Also read: Covid Treatment Charges: ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, పరీక్షల ధరల వివరాలివీ
సందీప్ కుమార్ సుల్తానియా వివరణ విన్న హై కోర్టు.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేయకుండా మరో వారం రోజుల్లో విద్యా సంస్థల పునఃప్రారంభంపై (Schools reopening) పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖను ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook