Schools reopening in Telangana: హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ ముగించి అన్‌లాక్ చేసేందుకు నిర్ణయించుకున్న రాష్ట్ర కేబినెట్ అలాగే రాష్ట్రంలో విద్యా సంస్థలు సైతం పునఃప్రారంభించాలని నిర్ణయించింది. అన్ని విద్యా సంస్థలను (Schools and colleges) జూలై 1 నుంచి పూర్తి స్థాయి ప్రారంభించాలని కేబినెట్ విద్యా శాఖకు ఆదేశాలు జారీచేసింది. పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు, ఆన్‌లైన్ క్లాసులు (Online classes) కొనసాగింపు తదితర అంశాలపై విధి విధానాలు ఖరారు చేస్తూ ఆదేశాలను విడుదల చేయాల్సిందిగా విద్యా శాఖకు జారీచేసిన ఆదేశాల్లో కేబినెట్ పేర్కొంది.
Guidelines during unlock: అన్‌లాక్ చేసినప్పటికీ మార్గదర్శకాలు పాటించాల్సిందే:
తెలంగాణ అన్‌లాక్ (Telangana unlock news) దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ.. కరోనా కట్టడి విషయంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర నిబంధనలు యధావిధిగా అమలులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుచేసింది. కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణతో కరోనా మార్గదర్శకాలను విధిగా పాటించాలని సూచించింది.
Also read : Telangana unlock: నేటి నుంచే తెలంగాణలో అన్‌లాక్.. Corona guidelines తప్పనిసరి
ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లేనిదే కరోనాను పూర్తిస్థాయి నియంత్రించలేమని.. అందుకే ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా కరోనా (COVID-19) నియంత్రణకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Also read: Telangana unlock, HMRL, TSRTC timings: మెట్రో రైళ్లు, టిఎస్ఆర్టీసీ బస్సుల టైమింగ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook