Telangana: మరో 11 మందిని బలి తీసుకున్న కరోనా
COVID-19 updates: హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం కొత్తగా 1,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో రోజూలాగే జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 796 కేసులు ఉన్నాయి.
COVID-19 updates: హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం కొత్తగా 1,597 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో రోజూలాగే జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 796 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో -212, మేడ్చల్ జిల్లాలో-115, సంగారెడ్డి జిల్లాలో-73, వరంగల్ అర్బన్ జిల్లాలో-44, కామారెడ్డి జిల్లాలో-30, కరీంనగర్ జిల్లాలో-41, నల్గొండ జిల్లాలో-58, సిద్దిపేట జిల్లాలో-27, మంచిర్యాల జిల్లాలో-26, పెద్దపల్లి జిల్లాలో-20 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ కారణంగా బుధవారం 11 మంది మృతి చెందారు. తాజాగా నిర్ధారించిన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,342 మందికి కరోనా సోకగా.. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 386 కు చేరింది. Also read: COVID-19 vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఏయే దేశాలు ముందున్నాయి.. సమగ్ర కథనం
నేడు 1,159 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు అలా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మొత్తం 25,999 మందికి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ( Also read: Jio Glass price: జియో గ్లాస్ ధర ఎంత ? జియో గ్లాస్ ఫీచర్స్ ఏంటి ? )