తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి పెరిగిపోతోంది. కరోనా కేసుల లెక్కలపై ప్రతిపక్షాలు ఆరోపించడంతో పాటు హైకోర్టు సైతం కేసుల వివరాలపై సీరియస్ అయ్యింది. తాజాగా 2,426 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య  1,52,602 (లక్షా 52 వేల 602)కు చేరింది. TS Inter Academic Calendar: మార్చి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది కరోనాతో చనిపోయారు. తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 940కి చేరింది. మొత్తం కేసులకుగానూ 1,19,467 మంది చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 32,195 యాక్టివ్ కేసులుండగా, 25,240 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 20,16,461 కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపింది. TS POLYCET Result 2020: తెలంగాణ పాలిసెట్ 2020 ఫలితాలు విడుదల 


ఫొటో గ్యాలరీస్:



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR